యూట్యూబ్‌లో కనిపించే ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? మిస్టరీ గర్ల్‌ దొరికేసింది..!

-

యూట్యూబ్ ఓపెన్‌ చేస్తే చాలు.. మనకు ఈ అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. ఫేస్‌బుక్‌లో కూడా ఈ అమ్మాయిని మీరు చూసే ఉంటారు. ఈ మధ్యో ఈ అమ్మాయి మీద రీల్స్‌, మీమ్స్‌ కూడా తెగ వైరల్‌ అవుతున్నాయి. అసలు ఎవరు ఈ అమ్మాయి. ఈ మిస్టీరియస్‌ గర్ల్‌ ఎవరో తెలుసుకుందాం అని చాలామంది ట్రై చేశారు. ఎట్టకేలకు పాప ఎవరో దొరికింది.

ఫేస్‌బుక్ ప్రకటనల ద్వారా యూట్యూబ్‌లో ఫేమస్ అయిన ఈ అమ్మాయి పేరు నుపుర్ చాబ్రా. ఈమె గురించి చాలామందికి తెలియదు. ఈ యాడ్ చూసినవారు కూడా ఆమె ఎవరా అనే సందేహం ఒకసారి అయిన వచ్చి ఉంటుంది. నుపుర్ చాబ్రా మన దేశానికి చెందిన అమ్మాయే. అయితే ఆమె అమెరికాలో ఉంటున్నారు. నుపుర్ చాబ్రా మైనర్ అండ్ మార్కెటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో పూర్తి చేశారు. అంతేకాకుండా బిజినెస్ ఎకనామిక్స్‌లో, ప్రిన్సిపుల్స్ ఆఫ్ అకౌంటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కూడా పూర్తి చేశారు.

ఆమె సామాజిక మధ్యమాలలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్‌లో ఉంది. అయితే నుపుర్ చాబ్రా కేరింగ్ హండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. ఈమె ఏఐ టెక్నికల్ రీక్రుటర్‌గా, మార్కెటింగ్ మీడియా మేనేజర్‌గా ఫేస్ బుక్‌లో ఆరు సంవత్సరాలు పని చేశారు. ప్రస్తుతం నుపుర్ చాబ్రా శాన్ ఫ్రాన్సిస్కోలో రా బ్లాక్స్‌లో రీక్రుటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే, మరో వైపు కేరింగ్ హండ్స్ ఫర్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్‌కు ఎక్స్క్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

లెట్స్ హాంగిన్ అనే నాన్ ప్రాఫిటబుల్ సంస్థకు కో ఫౌండర్ గా ఉన్నారు. దీనిని ఉద్యోగం కోల్పోయినవారికి సహాయం అందించడం కోసం డిజైన్ చేశారు. ఈ సంస్థ ద్వారా 2020లో ఉద్యోగం కోల్పోయిన చాలామందికి హెల్ప్ చేశారట. 2020లో నుపుర్ సాహిల్ అనే వ్యక్తిని అక్టోబర్ 17 న వివాహం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news