“భారత్” పేరు నచ్చని వాళ్ళు దేశం వదిలి వెళ్ళచ్చు.. బిజెపి నేత కీలక వ్యాఖ్యలు

-

మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ క్షణంలోనైనా నిర్ణయం తీసుకోబోతుందని మీడియాలో వినిపిస్తున్న కథనాల సారాంశం. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అభిప్రాయాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

వచ్చే ఎన్నికలలో బిజెపి భారత్ అనే నినాదంతో సత్తా చాటాలనుకుంటుందట. దీనికోసం ఇప్పుడే ఓ లీకు వదిలి దేశ ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం చేస్తుందని సమాచారం. అయితే ఇండియా అన్న పేరు మార్చితే ఐక్యరాజ్యసమితి దగ్గర నుంచి, చాలా విషయాలలో చాలా మార్పులు చేయాల్సి వస్తుందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. దీనిపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ బిజెపి నేత దిలీప్ ఘోష్. ఇండియా నుండి భారత్ పేరుగా మార్చడాన్ని తప్పు పడుతున్న వారిపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ అనే పేరు నచ్చని వారు, వ్యతిరేకించే వారు ఎవరైనా సరే వారు దేశం విడిచి వెళ్లిపోవచ్చని అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడూ వివాదాస్పదంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news