కారును రివర్స్‌లో డ్రైవ్ చేసిన కుక్క.. వైరల్ వీడియో..!

కుక్కలు ఎప్పటి నుంచో మనుషులకు అత్యంత విశ్వాసపాత్రమైన జంతువులుగా ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇతర ఏ జంతువులకూ లేని సాన్నిహిత్యం కుక్కలతో మనకు ఉంటుంది. అయితే ఎంత శునకమైనా అది కూడా ఓ మాటలు రాని మూగజీవే కదా.. మనుషులకున్నంత జ్ఞానం, ఆలోచన దానికి ఉండవు. కానీ ఆ కుక్క మాత్రం ఏకంగా ఓ కారును రివర్స్‌లో డ్రైవ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

dog drives car in revers for an hour police got shocked to see that

ఫ్లోరిడాలోని అన్నె సబొల్ అనబడే మహిళకు చెందిన కుక్క పేరు మ్యాక్స్. అది లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన శునకం. అయితే ఆ శునకం అన్నె సబొల్ కారులోకి ఎలా ఎక్కిందో తెలియదు కానీ.. కారును రివర్స్‌లో గంట పాటు డ్రైవింగ్ చేసింది. ఈ క్రమంలో కారు ఒకే చోట గుండ్రగా గంట పాటు తిరిగింది. ఆ క్రమంలో అన్నె సబొల్ ఇంటి పక్కన ఉండే మరొక ఇంటి యజమాని పోస్ట్‌బాక్స్‌ను ఆ కారు ఢీకొట్టడంతో ఆ బాక్సు ధ్వంసమైంది. అయితే చివరకు పోలీసులు వచ్చి కారును ఆపి డోర్ తీసి చూడగా.. అందులో వారికి కుక్క కనిపించింది. దీంతో వారు అవాక్కయ్యారు. అయితే వారు అన్నె సబొల్‌పై ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. తమ పక్కింటి ఓనర్‌కు కొత్త పోస్టు బాక్స్ కొనిస్తానని ఆమె చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలో ఆ కుక్క అలా కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఆ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది..!