హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొట్టి. బయో డైవర్సిటీ ప్లైఓవర్‌పై నుంచి కింద పడింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదులోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ముగ్గురు మరణించినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనకు అతివేగమే కారణమని ప్రత్యక్షసాక్షుల కథనం. ఫ్లైఓవర్ పైనుంచి దూసుకువచ్చిన కారు కింద ఉన్న మరో రెండు కార్లపై పడింది. వెంటనే స్పందించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందజేసి ఆరుగురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.