ప్రేమ కోసం.. 70 ఏళ్ల వ‌య‌సులో వృద్ధురాలు విడాకులు

-

ప్రేమకు క‌ళ్లు లేవ‌ని అంటారు. అలాగే వ‌య‌సుతో కూడా ప‌ని లేదని కూడా అంటారు. ప్రేమ కోసం చాలా మంది సంవ‌త్స‌రాల పాటు ఎదురు చూస్తారు. కొంత మంది తాము ప్రేమించిన వారి కోసం దేనికైనా సిద్ధ ప‌డుతారు. ఎలాంటి త్యాగానికైనా వెనుకాడ‌రు. యుద్ధాలు సైతం చేయ‌డానికి సిద్దం అవుతారు. అంతటి గొప్ప శ‌క్తి ప్రేమ‌కు ఉంటుంది. ప్రేమ ప‌వ‌ర్‌ను మ‌రో సారి రుజువు చేసింది.. ఒక వృద్ధురాలు. తాను ప్రేమించిన వారి కోసం ఏకంగా 73 ఏళ్ల వ‌య‌స్సులో విడాకులు తీసుకుంది.

అమెరికా కు చెందిన కార్ల్ హెచ్. మ్యాక్ అనే మ‌హిళా త‌న నాలుగు ద‌శాబ్ధాల పెళ్లి సంబందాన్ని ప్రేమ కోసం తెంచుకుంది. అలాగే ప్రేమించిన వ్య‌క్తితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. ఈ విషయాన్ని కార్ల్ హెచ్ . మార్క్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. జీవితం చాలా విచిత్ర‌మైనది. దాదాపు నాలుగు ద‌శాబ్ధాల పెళ్లి జీవితాన్ని తెంచుకున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ ఒక సింగ‌ల్ గా మారాను.

అలాగే ఊహించ‌ని ప్రేమ‌కు ద‌గ్గ‌ర అవుతున్నాను. అంటూ త‌న ఎంగేజ్ మెంట్ రింగ్ తో ట్విట్ట‌ర్ లో పోస్టు చేసింది. ఈ ట్వీట్ రెండు రోజుల ముందు పోస్టు చేసినా.. ప్ర‌స్తుతం ప్రేమికుల రోజు కావ‌డంతో సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతుంది. బామ్మా మ‌రోసారి ప్రేమ అంటే ఎమిటో తెలిసేలా చేశారు అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version