ఈ రాశి వారిని పొరపాటును కూడా ఏమి అనద్దు… అస్సలు తట్టుకోలేరట…!

-

మనుషులు అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా వుంటారు. అయితే ఈ రాశి వాళ్ళని మాత్రం అస్సలు ఏమన్నా తట్టుకోలేరు. విమర్శలును అసలు తీసుకోలేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి ఆ రాశుల వారి గురించి చూద్దాం.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరు. వాటినన్నిటిని కూడా వీళ్ళు మనసులో పెట్టేసుకుంటారు. ఇతర వ్యక్తుల నుండి వీళ్ళు దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారితో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

కన్యా రాశి:

కన్యా రాశి వాళ్లు కూడా విమర్శల్ని అసలు తీసుకోలేరు. అందుకే ఎవరైనా విమర్శిస్తే వెంటనే కోపం వస్తుంది. ఈ రాశి వాళ్లు తెలివైనవారు అలాగే ఈ రాశి వాళ్లు కాస్త కించపరిచేలా మాట్లాడుతారు. కనుక వీరితో కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది తప్పదు.

ధనస్సు రాశి:

ఈ రాశి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తే అసలు సహించలేరు. వీళ్ళని మార్చాలని మనం చూస్తే వాళ్ళు మనల్ని అసహ్యించుకుంటారు. విమర్శలను వీళ్ళు ద్వేషిస్తారు. వాళ్ల తప్పులు వాళ్లకు తెలిసిన వాళ్లని వేలెత్తి చూపకూడదు అని అనుకుంటూ ఉంటారు.

తులారాశి:

ఈ రాశి వాళ్ళని ఎవరైనా విమర్శిస్తే అవమానంగా భావిస్తారు. ఎక్కువ గొడవలు పెట్టుకోరు. రెసెర్వెడ్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారితో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version