క్లాస్ రూంలోనే మద్యం తాగిన విద్యార్థినులు.. చున్నీలు అడ్డం పెట్టుకొని..!

-

వామ్మో… ఇది చలికాలమా లేక కలికాలమా? జనరేషన్ మారింది అంటే ఇంతలా మారిందా? ఏకంగా క్లాస్ రూంలోనే అది కూడా టీచర్లు పిల్లలకు పాఠాలు చెబుతుండగానే మరోవైపు విద్యార్థినులు చున్నీలు అడ్డం పెట్టుకొని మద్యాన్ని గుటకాయస్వాహ చేసేస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడకు సమీపంలోని నిడమానూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్నది.

అదే స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థినులు రోజూ స్కూల్ కు మద్యం బాటిల్ ను తీసుకొచ్చి క్లాస్ జరుగుతుండగా మద్యాన్ని తాగేవారట. అయితే.. వారి నుంచి అదో రకంగా వాసన రావడం.. వాళ్లు తోటి విద్యార్థినులతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం గమనించిన తోటి విద్యార్థినులు.. వాళ్లపై స్కూల్ టీచర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లపై నిఘా పెట్టి టీచర్లు వాళ్లు చేసే పనిని చూసి షాక్ అయ్యారు. క్లాస్ రూంలో ఇంటర్వెల్ సమయంలో, క్లాస్ నడుస్తుండగా.. భోజన విరామ సమయంలో తమతో పాటు తెచ్చుకున్న మద్యం సీసాలను ఓపెన్ చేసి మద్యం తాగడం గమనించారు. వాళ్లను వెంటనే పట్టుకొని… ఈఘటనను ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకొచ్చారు. వాళ్లకు వైద్య పరీక్షలు చేయగా.. వాళ్లు మద్యం తాగినట్టు తేలింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రిన్సిపాల్.. వీళ్ల వల్ల మిగితా పిల్లలు కూడా చెడిపోతారని.. వీళ్లు స్కూల్ లో ఉండకూడదని.. మద్యం తాగిన ఇద్దరు విద్యార్థినులకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version