నువ్వా.. నేనా.. అడవిలో మేక, నెమలి ఆసక్తికర పోరాటం. వీడియో వైరల్

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ వీడియో ఎలా వైరల్ అవుతుందో తెలియడం లేదు. మనం సాధారణంగా చూస్తుండే వీడియోలే అప్పుడప్పుడు వైరల్ కావడం చూస్తున్నాం. ఇటీవల కాలంలో కొన్నిజంతువుల విచిత్ర ప్రవర్తన, వాటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక్కోసారి అయ్యో అనేలా ఉంటే… మరికొన్ని చాలా ఫన్నీగా ఉంటున్నాయి. దీంతో నెటిజెట్లు ఈ వీడియోలను విరగబడి చూస్తుండటంతో వైరల్ గా మారుతున్నాయి. సరిగ్గా ఇలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. 

తాజాగా అడవిలో  ఓ మేక, నెమలి పోరాటం నెటిజెన్లను తెగ ఆకట్టుకుంటోంది. నువ్వా.. నేనా అన్న రీతిలో ఈ రెండు తలబడుతున్నాయి. ఒకదాని నుంచి మరొకటి తప్పించుకుంటూ… మళ్లీ అటాకింగ్ పొజిషన్లకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. 9 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఒకదానితో ఒకటి తీసిపోకుండా పోరాటం కొనసాగిస్తున్నాయి.

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “అప్నీ సమర్థ్య పర్ హమేషా భరోసా కరీన్, ఈశ్వర్ నే సభీ కో ముసిబతోన్ సే తక్రానే యోగ్య బనాయా హై (ఎల్లప్పుడూ నీ శక్తిపై నమ్మకం ఉంచు, దేవుడు ప్రతి ఒక్కరినీ కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు)” అని వీడియోను పోస్ట్ చేస్తూ కబ్రా కామెంట్ చేశాడు.