అయ్యో.. అయ్యో.. మీ చేతులు పడిపోను.. బాలయ్యను చంపేశారు కదా..!

-


గూగుల్‌లో దొరికే సమాచారం అంతా సరైందే అని మనం సంకలు గుద్దుకుంటామా? ఓ సారి గూగుల్‌లో నందమూరి బాలకృష్ణ అని టైప్ చేయండి. కుడి వైపున బాలకృష్ణ బొమ్మ, కింద వికీపీడియాకు సంబంధించిన సమాచారం.. దాని కింద ఆయన ఎప్పుడు, ఎక్కడ పుట్టాడు.. భార్య, పిల్లలు.. ఎట్సెట్రా అన్ని కనిపించాయా? ఆయన ఎప్పుడు పుట్టాడు.. భార్య వివరాలను చదవండి. షాక్ అయ్యారా? అదే చెప్పేది. నందమూరి బాలకృష్ణ 1913 లో పుట్టాడట.. అది కూడా అర్సికెరెలో అట. 1995లో బెంగళూరులో చనిపోయాడట. వామ్మో.. వామ్మో.. ఈ గూగులోడికి ఎంత దైర్యం ఉంటే మా బాలయ్య చనిపోయాడని డేట్‌తో సహా చెబుతున్నాడు. ఈ గూగుల్ ఇంత పని చేస్తుందా? ఇని తప్పుల తడకల సమాచారం అందిస్తున్నదా? అని ఆవేశ పడుతున్నారా? అసలు.. గూగుల్ నందమూరి బాలకృష్ణ గురించి సమాచారం అడిగితే అలా తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చింది అన్న ఆలోచన మీకు రాలేదా? వచ్చే ఉంటుంది. ముందు గూగుల్‌ను తప్పు పట్టే కన్నా.. అసలు గూగుల్ ఎందుకు ఆ డేటా ఇవ్వాల్సి వచ్చిందో తెలుసుకుంటే పోలా..

గూగుల్ దగ్గర సపరేట్ డేటా బ్యాంక్ అంటూ ఏదీ ఉండదు. అంటే.. ఇప్పుడు మీరు దేని గురించయినా వెతికినప్పుడు గూగుల్‌కు సమాచారం ఎక్కడినుంచి వస్తుంది. అది కూడా తన దగ్గర ఉన్న సర్వర్లలో వెతికి మీకు ఇస్తుంది. తన దగ్గర ఉన్న సర్వర్లలోని డేటా గూగుల్ తయారు చేసుకున్నది కాదు. గూగుల్‌కు సబ్మిట్ చేసిన వెబ్‌సైట్లు, బ్లాగులు, వికీపీడియా లాంటి సైట్ల నుంచి అది డేటా సేకరించి.. సెగ్రగేట్ చేసుకొని తన దగ్గర పెట్టుకుంటుంది. యూజర్ కీవర్డ్‌ను బేస్ చేసుకొని అతడికి కావాల్సిన సమాచారం అందిస్తుంది. అది తప్పా.. రైటా.. అనేది దానికి తెలియదు. అక్కడ ఏ సమాచారం ఉంటే అది ఇచ్చేయడమే దాని పని.

ఇప్పుడు బాలకృష్ణ విషయంలో ఏం జరిగిందంటే.. నిజానికి ఫేమస్ బాలకృష్ణలు ఇద్దరు ఉన్నారు. ఒకరు మన నందమూరి బాలకృష్ణ కాగా.. మరొకరు కన్నడ యాక్టర్ టీఎన్ బాలకృష్ణ. ఈ టీన్‌బాలకృష్ణ పుట్టింది 1913లో.. చనిపోయింది 1995లో. ఆయన వికీపీడియా డేటాను మన నందమూరి బాలకృష్ణకు అనుసంధానం చేసింది గూగుల్. మరి.. గూగుల్ అలా ఎందుకు చేసింది.. అనే మరో డౌటనుమానం మీకు వచ్చి ఉంటుంది. దాంట్లో కూడా ఓ తిరకాసు ఉంది. మీరు నందమూరి బాలకృష్ణ అనే రెండు కీవర్డులను ఉపయోగించి సెర్చ్ చేశారు. అయితే.. నందమూరి, బాలకృష్ణ అనే రెండు కీవర్డ్స్‌ను అది పరిగణనలోకి తీసుకొని నందమూరికి మ్యాచ్ అయ్యే సమాచారాన్ని, బాలకృష్ణకు మ్యాచ్ అయ్యే సమాచారాన్ని అందిస్తుందన్నమాట. అలా వచ్చిందే ఆ డేటా. ఇందులో గూగుల్‌ను తప్పు పట్టాల్సిన పనిలేదు.. వికీపీడియాను తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆల్గారిథమ్‌ను బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అందుకే హ్యూమన్స్ ఇన్వాల్వ్ మెంట్ ఏమీ ఉండదు. ఆల్గారిథమ్ ప్రకారం గూగుల్ బాట్ సమాచారాన్ని యూజర్స్‌కు చేరవేయడమే. అది అసలు సంగతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version