ఫ్రెంచ్ టైటిల్ తో ప్రభాస్..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సాహో సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇదే కాకుండా జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకు టైటిల్ గా అమూర్ అనే టైటిల్ పెట్టనున్నారని తెలుస్తుంది. అమూర్ ఇదేదో వెరైటీ టైటిల్లా ఉందే అనుకోవచ్చు. ఇది ఓ ఫ్రెంచ్ పదం. ఈ సినిమా మొత్తం యూరప్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుందట.

అందుకే సినిమాకు టైటిల్ గా అమూర్ అని పెడుతున్నారట. అయితే ఈ టైటిల్ కన్విన్స్ చేసేలా సినిమాలో దర్శకుడు కొన్ని సీన్స్ రాసుకున్నాడట. అమూర్ అంటే తెలుగులో ప్రేమ అని అర్ధమట. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దె నటిస్తుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version