పదోతరగతి పరీక్షలో 50కి 80 మార్కులేశాడు..!

-

రేయ్.. బాబులు.. బాగా చదవాలి.. నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలి.. అంటూ టీచర్లు విద్యార్థులను ఎప్పుడూ అంటుంటారు. ఓ విద్యార్థి మాత్రం వాళ్ల టీచర్ మాటను బాగా ఒంట పట్టించుకున్నట్టున్నాడు.. అందుకే 50 మార్కులకు 80 మార్కులు పొందాడు. షాకింగ్‌గా ఉందా? 50కి ఎనబై ఎట్లా వేస్తరయ్యా.. అంటూ దీర్ఘాలు తీయకండి. ఇంకాస్త ముందుకెళ్లి చదివితే మీకే అర్థమవుతుంది.

అది గుజరాత్.. పదో తరగతి పరీక్షలు జరిగాయి. వాటి రిజల్ట్స్ కూడా వచ్చాయి. అందరి లాగే ఓ విద్యార్థి తన ఫలితాలను చూసుకున్నాడు. కానీ.. షాక్ అయ్యాడు. ఎందుకంటే మ్యాథ్స్‌లో మనోడికి 80 మార్కులొచ్చాయి. నిజానికి అది 50 మార్కుల పరీక్ష. అయితే.. ఏం జరిగిందా అని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే తెలిసిందేంటంటే… ఆ విద్యార్థికి వచ్చింది 8 మార్కులు. కానీ.. పేపరు దిద్దిన టీచర్ 8కి బదులు 80 వేశాడు. అదీ సంగతి.

అయితే.. గుజరాత్‌లో ఇలా పేపర్లు దిద్దే విషయంలో తప్పిదాలు జరగడం ఇదే కొత్త కాదు. ఇదివరకు ఇటువంటి ఘటనలు చాలా జరిగాయట. ఇప్పటి వరకు ఇలా తప్పుడు మార్కులు వేసిన 3200 మంది టీచర్లకు గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ సమన్లు జారీ చేసిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version