దర్శకుడిగా త్రివిక్రం వరుస సక్సెస్ లను అందుకున్నాడు. ఈ ఇయర్ వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం అతన్ని వెనక్కి నెట్టేసింది. పవన్, త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా అంచనాలకు మించి ఉంటుంది అనుకుంటే అజ్ఞాతవాసి నిరాశపరచింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో చేస్తున్న అరవింద సమేత సినిమా మీద కూడా పడిందని తెలుస్తుంది.
ఎన్.టి.ఆర్, త్రివిక్రం మొదటిసారి కలిసి చేస్తున్న సినిమాగా అరవింద సమేత మీద చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. అయితే అజ్ఞాతవాసి 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో సగం కూడా వెనక్కి తీసుకు రాలేదు. అందుకే ఇప్పుడు అరవింద సమేతకు అడ్వాన్స్ రూపంలో బిజినెస్ చేయాలని చూస్తున్నారట.
ఓ పక్క ఇదే బ్యానర్ నుండి వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాకు కూడా బిజినెస్ అంతగా జరుగట్లేదని టాక్. అరవింద సమేత ఎలా లేదన్నా 100 కోట్ల బిజినెస్ చేయాల్సి ఉంది. కాని అజ్ఞాతవాసి డిజాస్టర్ వల్ల డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు సాహస్మ చేయలేకున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్ కూడా రెగ్యులర్ మాస్ సినిమాలానే ఉండటంతో పంపిణీదారులకు మరింత డౌట్ పెరిగింది.