వింత: రంగులు మార్చే బల్లిని ఎప్పుడైనా చూసారా…?

-

సాధారణంగా ఊసరవెల్లి రంగులు మారుస్తుంది. కానీ బల్లి రంగులను మార్చడం ఏమిటి అని అనుకుంటున్నారా..? నిజమేనండి రంగులు మార్చే బల్లులు కూడా ఉన్నాయి. ఎక్కడో విదేశాల్లో జరిగినది కాదు. ఇది మన దేశం లోనే జరిగింది. ఇది రంగుల మార్చేయగలదు… పక్షులు మాదిరి ఎగరగలదు కూడా. చూసారా ఎంత వింతగా ఉందో…! మరి ఇప్పుడే దీని కోసం మొత్తం తెలుసుకోండి. రంగులు మార్చే, ఎగిరే బల్లులు చాలా అరుదుగా కనిపిస్తాయి.

lizards
lizards

అలాంటిది ఒకటి ఉత్తరాఖండ్ లో కనిపించింది. ఇప్పుడు ఈ బల్లి బాగా వైరల్ అవుతోంది. సాధారణంగా బల్లులు గోడల పై పాకుతూ వెళ్లడం మనకి తెలుసు… కానీ ఎగిరే బల్లులను మనం చూడడం చాలా అరుదు. అయితే అలాంటిది ఉత్తరాఖండ్ లోని రైతు పొలం లో కనువిందు చేసింది. ఈ బల్లి ఒక చెట్టు నుంచి మరొక చెట్టు పైకి పక్షుల్లాగా ఎగురుతూ కనువిందు చేసింది. ఈ బల్లికి చిన్న చిన్న కాళ్ళతో పాటు పెద్ద తోక కూడా ఉంది. ఈ బల్లి ఒకచోట నుంచి మరొక చోటుకు దాదాపు వంద మీటర్లు వరకు ఎగరగలదని అటవీ అధికారులు తెలియజేశారు.

ఇక ఈ బల్లి జాతి గురించి చూస్తే… “డ్రాకో వొలాన్స్‌” అనే అరుదైన జాతికి చెందిన ఈ బల్లి ముందు కాళ్ళ నుంచి వెనుక కాళ్ళ వరకు రెక్కలు విస్తరించి ఉన్నాయి. ఈ బల్లి ఏ చెట్టు పై కూర్చుంటే ఆ చెట్టు ఆకుల రంగులోకి మారిపోతుంది. ఇవి అరుదైన బల్లులు అని.. కేవలం పశ్చిమ కనుమలు, దక్షిణాసియా లోనే కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news