వింత కోడి… మెడ కింది నుంచి గుడ్లు పెడుతోంది.. వీడియో

1294

మండ్యకు చెందిన శివరామె గౌడ అనే వ్యక్తి గత రెండేళ్ల నుంచి ఓ కోడిని పెంచుకుంటున్నాడు. ఆ కోడి ఒక రోజు మెడ కింది భాగం నుంచి గుడ్డు పెట్టడాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి. మనం కూడా అప్పుడప్పుడు కొన్న వింతలు చూస్తుంటాం. కానీ.. ఈ వింతను మాత్రం మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అవును.. మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. ఇది ప్రకృతికి విరుద్ధమైన పని. సాధారణంగా కోళ్లు గుడ్లు ఎలా పెడతాయి. వెనుక నుంచి కదా. కానీ.. ఈ కోడి మాత్రం సమ్ థింగ్ స్పెషల్ కోడి.

hen laying eggs from neck video goes viral,

వెనుక నుంచి ఇది గుడ్లు పెట్టదు. దాని మెడ కింది భాగం నుంచి గుడ్లు పెడుతుంది. షాక్ అయ్యారు కదా. మీరు షాక్ అయినా.. కాకున్నా ఇది నిజం. ఈ వింత ఘటన కర్ణాటకలోని మండ్యలో చోటు చేసుకున్నది.

మండ్యకు చెందిన శివరామె గౌడ అనే వ్యక్తి గత రెండేళ్ల నుంచి ఓ కోడిని పెంచుకుంటున్నాడు. ఆ కోడి ఒక రోజు మెడ కింది భాగం నుంచి గుడ్డు పెట్టడాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. నెటిజన్లు కూడా కోడి మెడ కింది నుంచి గుడ్డు పెట్టడాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు.

అప్పటి నుంచి ఆ కోడి మెడ కింది నుంచే గుడ్లను పెడుతోందట. అయితే.. కోడి మెడ కింది నుంచి ఎలా గుడ్లు పెడుతోందో మాత్రం ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారట.


(Video Courtesy: ETV Telangana)