Bigg Boss 3 Telugu Episode 7: హిమజ, పునర్నవి సేఫ్.. రవిపై నాగ్ సీరియస్.. శ్రీముఖికి ప్రశంసలు

-

జాఫర్ తన భార్య గుర్తుకు రావడంతో కాసేపు కన్నీరు పెట్టారు. దాని గురించి కాసేపు నాగ్ మాట్లాడారు. తర్వాత పిల్లో రవి కృష్ణ దగ్గర ఆగింది. అయితే.. రవి కృష్ణ.. చిన్నపిల్లల టాస్క్ చేస్తున్నప్పుడు మహేశ్ విట్టాను కర్రోడా అని పిలిచాడు కదా. దానిపై నాగ్ కూడా సీరియస్ అయ్యారు.

బిగ్ బాస్ అప్పుడే ఏడు ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. నిన్న శనివారం కావడంతో నాగార్జున స్టేజీ మీదకు వచ్చి బిగ్ బాస్ కంటెస్టెంట్లను పలకరించారు. నిన్న హౌస్ లో ఏం జరిగిందో మన టీవీలో కాసేపు చూసిన తర్వాత ఇంటి సభ్యులతో నాగార్జున మాట్లాడారు. అందరు కుటుంబ సభ్యులతో మాట్లాడనప్పటికీ.. పిల్లో గేమ్ ప్రకారం కొందరితో మాట్లాడారు నాగ్.

ముందుగా జాఫర్ తో మాట్లాడారు. జాఫర్ తన భార్య గుర్తుకు రావడంతో కాసేపు కన్నీరు పెట్టారు. దాని గురించి కాసేపు నాగ్ మాట్లాడారు. తర్వాత పిల్లో రవి కృష్ణ దగ్గర ఆగింది. అయితే.. రవి కృష్ణ.. చిన్నపిల్లల టాస్క్ చేస్తున్నప్పుడు మహేశ్ విట్టాను కర్రోడా అని పిలిచాడు కదా. దానిపై నాగ్ కూడా సీరియస్ అయ్యారు.

రవిపై కొప్పడ్డారు. బిగ్ బాస్ హౌస్ లోనే కాదు.. ఎక్కడ కూడా కులం, జాతి, రంగుతో వేరు వాళ్లపై వివక్ష చూపించకూడదని రవికి నాగ్ బుద్ధి చెప్పారు. తర్వాత మహేశ్ కి రవి మరోసారి సారీ చెప్పాడు.

శ్రీముఖి.. ఇంటి సభ్యులు అందరితో బాధ్యతగా ఉంటుందని… శ్రీముఖిని నాగ్ మెచ్చుకున్నాడు. జాఫర్ కన్నీరు పెట్టుకున్నప్పుడు కూడా శ్రీముఖి ఆయన్ను ఓదార్చింది. అంతే కాదు.. చాలా విషయాల్లో ఇతర ఇంటి సభ్యులకు కూడా శ్రీముఖి అండగా నిలవడం బిగ్ బాస్ కే కాదు నాగ్ కు కూడా తెగ నచ్చిందట. అందుకే.. శ్రీముఖిపై నాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

అలా.. కాసేపు ఇంటి సభ్యులతో ముచ్చటించిన నాగ్.. ఎలిమినేషన్ రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఎలిమినేషన్ లో ఉన్న రాహుల్, హేమ, జాఫర్, వితిక, హిమజ, పునర్నవి.. ఈ ఆరుగురిలో హిమజ ముందుగా సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టు నాగ్ తెలపగానే.. హిమజ మళ్లీ కాసేపు భావోద్వేగానికి లోనయింది. ఆ తర్వాత మిగిలిన ఐదుగురు రాహుల్, హేమ, జాఫర్, వితిక, పునర్నవి.. వీరిలో పండు సేఫ్ అన్నాడు నాగ్. అయితే.. పండు ఎవరు అంటూ అంతా ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.

అయితే.. ఇక్కడ పండు అంటే పునర్నవి. ఆమె ముద్దు పేరు పండు అట. ఆమె ముద్దు పేరు తెలుసుకొని ఇలా చెప్పేశాడన్నమాట. పునర్నవి కూడా తను సేఫ్ జోన్ లోకి వెళ్లడంతో కాసేపు భావోద్వేగానికి లోనయింది.

హిమజ, పునర్నవి సేఫ్ కాగా.. మిగిలిన నలుగురు రాహుల్, హేమ, జాఫర్, వితిక… ఈ నలుగురిలో ఒకరు ఇంటి నుంచి ఇవాళ బయటికి వెళ్లిపోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news