విమానం మిస్సయింది.. ఆపాలంటూ దాని వెనుక పరిగెత్తాడు..!

-

మీరు బస్టాప్ లో నిలుచున్నారు. బస్సు ఆగకుండానే వెళ్తుంది. లేదంటే మీరు అప్పుడే బస్టాప్ కు వస్తుండగానే బస్సు కదులుతోంది. ఏం చేస్తారు. కాళ్లను పని చెబుతారు. పరిగెత్తి పరిగెత్తి ఎలాగోలా ఆ బస్సును క్యాచ్ చేస్తారు. అంత వరకు ఓకే కానీ.. ఈ వ్యక్తి చూడండి.. టేకాఫ్ అయిన విమానం వెనుక పరిగెత్తాడు. దేనికి అంటారా? అయ్యో.. మీకు ఇంకా అర్థం కాలేదా? విమానం మిస్సయింది. దీంతో ఆపండి.. ఆపండి.. అంటూ దాని వెనుక పరిగెత్తాడు. అది సంగతి.

ఇంతకీ ఏమైంది. విమానాన్ని ఆపారా? మనోడు విమానంలోకి ఎక్కాడా? అని అడకండి. ఎందుకంటే.. ఒకసారి టేకాఫ్ అయ్యాక మళ్లీ విమానం ఆపడం ఉండదు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే తప్ప. అందుకే విమానం స్టార్ట్ అవడానికి గంట ముందే ప్యాసెంజర్లందరినీ లోపలికి ఎక్కించుకుంటారు. స్టార్ట్ అయ్యాక వచ్చిన వాళ్లను.. టేకాఫ్ అయ్యాక వచ్చిన వాళ్లను కూడా ఆపి మరీ ఎక్కించుకోవడానికి అదేమన్నా బస్సా? కాదు కదా.

అందుకే.. ఎయిర్ పోర్ట్ డోర్ ను బద్దలు కొట్టి మరీ రన్ వేపై పరిగెత్తి విమానాన్ని ఆపాలంటూ మనోడు చేసిన రచ్చకు అక్కడి పోలీసులు మనోడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన ఐర్లాండ్ లోని డబ్లిన్ విమానాశ్రయంలో చోటు చేసుకున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version