ఇంటి కింద 45 డేంజరస్ పాములు.. షాక్ అయిన ఇంటి యజమాని.. వీడియో

-

మీకు పాములంటే భ‌య‌మా? పాములు ఇక్క‌డుంటే మీరు ఎక్క‌డో ఉంటారా? పామును చూడ‌గానే మీకు ఏదోలా అవుతుందా? అయితే ఈ వీడియో చూడ‌కండి..

ఒక్క పామును చూస్తేనే దడుసుకుంటాం. అటువంటిది 45 పాములు అవి కూడా డేంజరస్ ర్యాటిల్ స్నేక్స్‌ను ఒకే దగ్గర అది కూడా ఇంట్లో చూస్తే ఎలా ఉంటది. వామ్మో.. ఆ ఇంట్లో మనిషన్నవాడు ఉంటాడా అని అంటారా? కానీ.. ఆ ఇంటి ఓనర్‌కు తన ఇంటి కింద అన్ని పాములు ఉన్నాయని ఇన్ని రోజులు తెలియలేదు. ఏదో కేబుల్ కోసం వెతుకుతుండగా ఒక పాము కనిపించిందట. దీంతో వామ్మో అనుకొని వెంటనే స్నేక్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించాడు. వాళ్లు వచ్చి ఇంటికింద వెతికితే ఇంకేముంది ఒకదాని తర్వాత మరో పాము బయటపడ్డాయి. అలా 45 పాములు ఆ ఇంటికింద ఉన్నాయట. వాటిని బంధించి తీసుకెళ్లి సమీపంలోని అడవిలో వదిలేశారట.

ఈ ఘటన యూఎస్‌లోని టెక్సాస్‌లో ఉన్న అల్బానీలో చోటు చేసుకున్నది. పాములను పట్టుకుంటుండగా.. బిగ్ కంట్రీ స్నేక్ రిమూవల్ టీమ్ వీడియో తీసి తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ పాముల వీడియోను చూసి దడుసుకుంటున్నారు. రాటిల్ స్నేక్స్ చాలా డేంజర్. అవి కరిస్తే అంతే. ఇదివరకు టెక్సాస్‌లో ఓ వ్యక్తికి తన షెడ్ కింద 30 ర్యాటిల్ స్నేక్స్ కనిపించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version