ఆర్.ఆర్.ఆర్ కు టైటిల్స్ ఇవే..!

-

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆర్.ఆర్.ఆర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈమధ్య ప్రెస్ మీట్ లో ఆర్.ఆర్.ఆర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదే టైటిల్ గా ఉంచుతూ ఒక్కో భాషలో ఒక్కో ట్యాగ్ లైన్ పెడతామని అన్నారు రాజమౌళి. అయితే రాజమౌళి పెట్టేదాకా వెయిట్ చేయాలా అదేదో మనమే పెట్టేస్తే పోలా అని కొందరు నెటిజెన్లు ఆర్.ఆర్.ఆర్ కు టైటిల్ ఫిక్స్ చేస్తున్నారు.

అలా నెట్లో ప్రత్యక్షమవుతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ను చూస్తే ఆర్.ఆర్.ఆర్ అని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి సినిమా టైటిల్ గా రామ రావణ రాజ్యం అన్నది వినపడుతూనే ఉంది. ఇక మరోపక్క రం రం రుథిరం అని ఓ టైటిల్ పెట్టారు. ఇక సినిమా కథకు యాప్ట్ అయ్యేలా రఘుపతి రాఘవ రాజారాం అని కొందరు నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. రఘుపతి రాఘవ రాజారాం టైటిల్ అయితే అన్ని భాషలకు యాప్ట్ అవుతుంది. ఇక ఇదే క్రమంలో ఆర్.ఆర్.ఆర్ కు రౌద్ర రణ రంగం టైటిల్ కూడా వినపడుతుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాగా ఆర్.ఆర్.ఆర్ కు తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version