దీపావళి ఆఫర్: మొబైల్ బుక్ చేస్తే బట్టల సబ్బు వచ్చింది..!

-

ఈకామర్స్ సంస్థలు పండుగ ఆఫర్లు అంటూ ఎలా ఊరిస్తాయో తెలుసు కదా. దసరా ఆఫర్లు, దీపావళి ఆఫర్, సంక్రాంతి ఆఫర్లు.. ఇలా ప్రతి పండుగకు డిస్కౌంట్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి ఈకామర్స్ సంస్థలు. తాజాగా దీపావళి ఆఫర్లు ప్రకటించిన ఓ ఆన్ లైన్ సంస్థ.. మొబైల్ కు బదులు బట్టల సబ్బు పంపించింది.

ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చోటు చేసుకున్నది. చేవెళ్లకు చెందిన ఓ యువకుడు ఓ ఈకామర్స్ సంస్థ నుంచి స్మార్ట్ ఫోన్ బుక్ చేశాడు. డబ్బులు ఆన్ లైన్ చెల్లించలేదు కానీ.. సీవోడీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సీవోడీ అంటే క్యాష్ ఆన్ డెలివరీ అన్నమాట. సో.. కోరియర్ బాయ్ ఆ యువకుడి అడ్రస్ కు వచ్చాడు. చెల్లించాల్సిన డబ్బులు చెల్లించి ఆ యువకుడు పార్సిల్ తీసుకున్నాడు. తర్వాత తాపీగా మనోడు పార్సిల్ ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే.. అందులో ఫోన్ లేదు గీన్ లేదు. బట్టల సబ్బు ముక్కలు ఉన్నాయి. దీంతో లబోదిబోమన్నాడు ఆ వ్యక్తి. 16 వేల రూపాయలు పెట్టి ఫోన్ కొటే 10 రూపాయల విలువైన బట్టల సబ్బు పంపించారని బోరుమన్నాడు. వెంటనే ఆ డెలివరీ బాయ్ కి ఫోన్ చేసినప్పటికీ అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని.. ఇప్పుడు ఎవరికి నా బాధ చెప్పుకోవాలంటూ బావురుమంటున్నాడు ఆ యువకుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version