టపాసులపై సుప్రీం ఎందుకు ఆంక్షలు విధించింది.. అవి ఆరోగ్యానికి హానికరమా?

-

టపాసులు.. బాంబులు.. టపాకాయలు.. బాణసంచా.. క్రాకర్స్… ఇలా పేరు ఏదైనా కానీ.. దీపావళి వచ్చిందంటే టపాసుల మోత మోగాల్సిందే. జయ్యి మంటూ రాకెట్లు ఆకాశంలో దూసుకుపోవాల్సిందే. స్విచ్చు బుడ్లు మిరుమిట్లు గొలుపుతూ వెలుగులు నింపాల్సిందే. భూచక్రాలు భూమిని చుట్టేయాల్సిందే. తోక బాంబులు టప్ మని పేలాల్సిందే. లక్ష్మీ బాంబులు చెవులను చిల్లులు పెట్టాల్సిందే. కాకరపుల్లలు పర్ పర్ మనాల్సిందే. ఇవన్నీ కాలిస్తేనే మనకు దీపావళి జరుపుకున్నట్టు. మొన్నటి దాకా బాగానే ఉండేది కానీ.. ఇప్పుడు ఒక్కసారిగా సుప్రీం టపాసులపై ఆంక్షలు విధించేసరికి టపాసుల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏమైంది. ఎందుకు టపాసులను పేల్చకూడదు. పేల్చితే వచ్చే సమస్యలేంటి.. ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? పర్యావరణానికి హాని కలుగుతుందా అన్న కోణంలో ప్రస్తుతం జనాలు ఆలోచిస్తున్నారు. మరి.. నిజంగా టపాసుల వల్ల కలిగే నష్టాలంటో తెలుసుకుందాం పదండి.

టపాసులను కార్బన్, సల్ఫర్ అనే కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తారు. ఈ కార్బన్, సల్ఫర్ కెమికల్స్ వల్ల వాతావరణంలోకి రకరకాల వాయువులు విడుదలవుతాయి. ఎప్పుడు… అంటే టపాసులను పేల్చినప్పుడు. ఇక.. టపాసులను కాల్చినప్పుడు మెరుపులు వస్తాయి కదా.. ఆ మెరుపుల కోసం యాంటిమొనీ సల్ఫైడ్ అనే కెమికల్ వాడతారు. ఇంకా రకరకాల రసాయనాలయినటువంటి బేరియం నైట్రేట్, లీథియం, కాపర్, స్ట్రోనియం లాంటి కెమికల్స్ ను వాడతారు. అయితే… టపాసుల తయారీలో ఉపయోగించే రసాయనాలన్నీ పర్యావరణానికి, మానవ జాతికి హాని చేసేవే.

ఆ కెమికల్స్ అన్నీ చాలా డేంజర్. వాటిలో విష పదార్థాలు ఉంటాయి. అవి మనుషులకు ఎన్నో రకాల వ్యాధులను తీసుకొస్తాయి. ఎలా అంటే.. మనం టపాసులు కాల్చాక పొగ వస్తుంది కదా.. ఆ పొగలో కెమికల్స్ పార్టికల్స్ ఉంటాయి. ఆ పొగను పీల్చిన వారి శరీరంలోకి కెమికల్స్ పార్టికల్స్ వెళ్లి రకరకాల రోగాలకు ఆజ్యం పోస్తాయి. అల్జీమర్స్, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, నరాల బలహీనత, హార్మోన్ల ఇమ్ బ్యాలెన్స్, నిద్రలేమి, బీపీ లాంటి ఎన్నో వ్యాధులు వస్తాయి.

టపాసులు పేల్చినప్పుడు వచ్చే శబ్దం కూడా డేంజరే. అది శబ్దకాలుష్యానికి దారి తీస్తుంది. శబ్ద తీవ్రత పెరిగిందంటే మనుషులకు వినికిడి సమస్యలు, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

టపాసులు పేల్చి మన ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకోవడమే కాకుండా వాతావరణాన్ని కూడా కాలుష్యం చేస్తున్నాం. వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాం. టపాసుల నుంచి వచ్చే హానికరమైన పొగ, ఇతర ప్రమాదకర రేణువులు, విష వాయువులు గాలిలో కలిసిపోయి అలాగే ఉండిపోతాయి. దాని ద్వారా పర్యావరణానికి హాని తలపెట్టిన వాళ్లమవుతాం.

చూశారా.. టపాసుల వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో. టపాసులను కాల్చడం ద్వారానే కాదు.. వాటిని తయారు చేయడమూ ఎంతో ప్రమాదం. చాలాసార్లు చూసేఉంటాం. బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. చాలా మంది చనిపోయారని.. అవును.. బాణసంచా తయారీ డేంజరే… కాల్చడం డేంజరే. ఇన్ని డేంజర్లు ఉన్న బాణసంచాను కాల్చకపోతే మన కిరీటం ఏమన్నా పడిపోతుందా? పైపెచ్చుకు మనం పర్యావరణాన్ని కాపాడినవాళ్లం అవుతాం. ఆలోచించుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version