ఇదంతా సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్, వైరల్ వీడియోలు, ట్రెండింగ్ న్యూస్ జనరేషన్ కదా. నేటి యూత్ ఏది చేసినా.. దాంట్లో అంతో ఇంతో కిక్కుండాలంటారు. కిక్కు కోసం ఎంతకైనా తెగిస్తారు. అవును.. ఎంతకైనా.. అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టి.. దాన్ని వైరల్ చేయడం కోసం ఏకంగా 11 అంతస్తుల నుంచి దూకేశాడు. ఈ ఘటన వాషింగ్‌టన్‌లో చోటు చేసుకున్నది.
నికోలే నయ్‌దేవ్ అనే 27 ఏళ్ల యువకుడు, అతడి ఫ్రెండ్స్ కలిసి రాయల్ కరేబియన్ క్రూజ్ షిప్ ఎక్కారు. అది వెళ్తుండగా.. నికోలేను అతడి ఫ్రెండ్స్ సముద్రంలోకి దూకేయాలంటూ ప్రోత్సహించారు. అతడు దూకుతుండగా వీడియో తీసి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి వైరల్ చేయాలన్నది వాళ్ల ఆలోచన. నికోలే వాళ్ల ఐడియాకు ఓకే చెప్పడమే కాదు.. దాదాపు 11 అంతస్తుల దూరం ఉన్న షిప్ పైనుంచి నీళ్లలోకి దూకేశాడు. ఈ విషయం తెలుసుకున్న రాయల్ కరేబియన్ నికోలే, అతడి ఫ్రెండ్స్‌ను షిప్‌లోకి మరోసారి ప్రవేశించడాన్ని నిషేదించింది. గత రాత్రి నీను తాగి ఉన్నా. నిద్ర లేచిన వెంటనే అలా దూకేశా.. అంటూ నికోలే చెప్పడం విశేషం. వాళ్లు అనుకున్నట్టుగానే ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.. అది వైరల్ కూడా అయింది కానీ.. నెటిజన్ల నుంచి ఫుల్లుగా అక్షింతలు తిన్నారు వాళ్లు.