పాటలు మార్చాలన్నందుకు పొడిచి చంపేశారు..

-

చినికి చికిని గాలివాన అయిందంటారు కదా.. సేమ్ అదే తరహాలో న్యూఢిల్లీలో చిన్న గొడవ కాస్త ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఢిల్లీలోని ఖయాలా ప్రాంతంలో చోటు చేసుకున్నది. అక్కడ దుర్గామాత మండపాన్ని ఏర్పాటు చేశారు. దుర్గామాత పూజలో భాగంగా మండపంలో పాటలు వేశారు. ఆ పాటలు అక్కడే ఉండే రియాజ్ అనే వ్యక్తికి నచ్చలేదు. దీంతో ఆ పాటలు కాదు.. వేరే పాటలు వేయండి. అవి మార్చేయండి అని దుర్గామండపం నిర్వాహకులను కోరాడు. ఈక్రమంలో మండపం నిర్వాహకులు, రియాజ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అది గొడవకు దారి తీసింది. అది కాస్త ముదిరింది. దీంతో నిర్వాహకుల్లో ఒక వ్యక్తి ఆవేశంతో ఊగిపోయి కత్తితో రియాజ్‌ను పొడిచాడు. దీంతో రియాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే రియాజ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తర్వాత సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయినప్పటికీ.. చికిత్స పొందుతూ రియాజ్ మృతి చెందాడు. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version