ముగ్గు వేస్తున్న యువతిని కిడ్నాప్ చేయడానికి యత్నించిన యువకుడు.. వీడియో

-

ఇవాళ భోగీ పండుగ కదా. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగాయె. అందుకే ఆ యువతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తోంది. ఏ కలర్ వేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ… తన సోదరితో కలిసి ముగ్గేస్తోంది. ఇంతలో దుంగడుల ముఠా ఆ యువతి దగ్గరకు వచ్చారు. ఓ వ్యక్తి బైక్ స్టార్ చేసి రెడీగా ఉన్నారు. మరో యువకుడు ముగ్గేస్తున్న ఆ యువతిని పైకి లాగి ఎత్తుకుపోబోయాడు. ఇంతలోనే ఆ యువతి సోదరి గట్టిగా అరిచింది. దీంతో చుట్టు పక్కన ఉన్న ఇళ్లలోని వారంతా బయటికి వచ్చి ఆ దుండగులను పట్టుకొని చితక్కొట్టారు. అనంతరం వాళ్లను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఆ దుండగులు.. ఆ యువతిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారన్న కోణంలో విచారిస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని బాపట్లలో చోటు చేసుకున్నది.

(Video Courtesy: TV9 Telugu)

Read more RELATED
Recommended to you

Exit mobile version