‘కౌగిలింత’తో సంవత్సరానికి 28 లక్షలు సంపాదిస్తోంది..!

-

అవును.. ఆమె ఉద్యోగమే కౌగిలించుకోవడం.. ఆ జాబ్ తోనే ఆమె లక్షలు సంపాదిస్తోంది. సంవత్సరానికి 28 లక్షల రూపాయల దాకా సంపాదిస్తోంది అంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. అయితే.. ఈ జాబ్ ఇండియాలో లేదు.. అమెరికాలో ఉంది. కన్సార్ కు చెందిన రాబిన్ స్టినె. ఆమె థెరపిస్ట్. కౌగిలింతలో థెరపిస్ట్.

ఎవరైనా సరే.. బాధలో గానీ.. ఒత్తిడిలో గానీ ఉనప్పుడు ఎవరినైనా హత్తుకోవాలనిపిస్తుంది. అలా ఒకరిని కౌగిలించుకున్నప్పుడు వాళ్లలోని ఒత్తడి కొంచెం తగ్గుతుంది. దీన్ని మనం చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోనూ చూశాం. అది నిజమే. అలా.. ఒత్తిడిలో ఉన్నవారిని కౌగిలించుకొని వాళ్లకు ఒత్తిడిని తగ్గించి లక్షలు సంపాదిస్తోంది ఈ మహిళ.

ఒత్తిడిలో ఉన్నవాళ్లు ఎవరైనా సరే.. ఆడ అయినా.. మగ అయినా.. వాళ్లకు కౌగిలించుకొని పడుకుంటుంది రాబిన్. తన శరీరాన్ని వాళ్లకు అప్పగిస్తుంది. వాళ్లు తమ చేతులతో తనను నిమరొచ్చు. చేతిలో చేయి వేయొచ్చు. కౌగిలించుకొని కాసేపు పడుకోవచ్చు. అంతే.. కానీ అంతకుమించి తను ఇంకేమీ చేయనీయదు. ఇది ఒక థెరపీ మాత్రమేనట. అలా చాలామందికి ఒత్తిడి తగ్గించిందట రాబిన్.

నిజానికి.. ఎవరినైనా మనం హత్తుకున్నప్పుడు.. మన శరీరంలో ఆక్సిటోసిన్ అనే ఓ హార్మోన్ రిలీజవుతుంది. అది ఒత్తిడిని దూరం చేస్తుంది. అందుకే… ఎవరినైనా కౌగిలించుకోగానే ఒత్తిడి దూరమవుతుంటుంది. ఒక గంట పాటు తనను కౌగిలించుకోవాలంటే… ఆరు వేల రూపాయల ఫీజు చెల్లించాలి. అలా తను సంవత్సరానికి కనీసం 28 లక్షల దాకా సంపాదిస్తుందట. వామ్మో.. ఈమె తెలివి సూపర్ కదా. కేవలం కౌగిలించుకొని ఇంత సంపాదించడమంటే గ్రేట్ కదా. తన ఆలోచనకు హేట్సాఫ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version