వార్నీ..ఇంకేం దొరకలేదా తల్లి నీకు..

-

ఈ మధ్య ఫుడ్ కు సంబంధించిన కొత్త ప్రయోగాలు సోషల్ మీడియాలో ఎక్కువ అవుతున్నాయి..కొత్త కొత్త రుచుల పేరుతో ఉన్న రుచి పై అసహ్యాన్ని కలిగిస్తున్నారు.. ఇప్పటివరకు మ్యాగి తో వాళ్ళకు నచ్చన వెరైటీలను తయారు చేశారు..ఐస్ క్రీమ్ మ్యాగీ, కోకో కోలా మ్యాగి ఇలా నానా చెత్త వంటలను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అవి కాస్త వైరల్ అవ్వడం తో మనోళ్లకు ఇంకా కొత్తగా చెయ్యాలి అనే పిచ్చి పట్టుకుంది. దాంతో ఇప్పుడు మరో కొత్త వంటకు శ్రీకారం చుట్టారు..

 

వేసవిలో విరివిగా దొరికే మామిడి పండ్లు, జ్యూస్ లతో స్వీట్ మ్యాగీ చేశారు.అది చూడటానికి కాస్త వెరైటీగా ఉన్న కూడా జనాలు ఆ రుచి కోసం ఎగబడటం విశేషం..అసలు ఆ మ్యాగి స్పెషల్ ఏంటో ఒకసారి చుద్దాము..మ్యాంగో మ్యాగీ’. మీరు విన్నది నిజమే. మ్యాగీని ముప్పుతిప్పలు పెట్టి చేసిన ఈ వెరైటీ వంటకం గురించి మీరూ తెలుసుకోవాల్సిందే. వీడియోలో ముందుగా.. ఫ్రై చేసే పెనంపై ఓ మహిళ మ్యాగీ నూడుల్స్‌ను వేసి, నీళ్లు పోసి మ్యాజిక్‌ మసాలా వేసింది..తర్వాత మాజా బాటిల్ ఓపెన్ చేసి కాస్త పోసింది.

వంటకమయ్యాక మామిడి ముక్కలను దానిపై చల్లి అందించింది. ఈ మ్యాం గో మ్యాగీ తయారీ వీడియోను ఒకరు పోస్ట్‌ చేయగా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘ఆ లొకేషన్‌ ఎక్కడో చెప్పరా. ఆ వంటకం చేసిన వాళ్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఎవరైనా వెళ్తారు’అని, ఇంకేం దొరకలేదా తల్లి అంటూ, మీరు నరకానికి పొతారు అంటూ నోటికి వచ్చిన కామెంట్లతో వీడియోను పాపులర్ చేశారు..ఇక ఆలస్యం ఎందుకు ఆ అధ్బుతాన్ని మీరు ఒకపారి చూసేయండి.. వీలైతే లైక్ , కామెంట్ వేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news