వామ్మో.. నిజంగా ఇది దెయ్యమేనా?

-

దెయ్యం.. వామ్మో.. దాని పేరు వింటనే కొంతమంది వణికిపోతారు. రాత్రిళ్లు ఎక్కడికైనా వెళ్తే ఎక్కడి నుంచి దెయ్యం వస్తుందిరా బాబు అంటూ బయపడే వారు కోకొల్లలు. అసలు నిజంగా దెయ్యం ఉంటుందా? ఉంటే ఇప్పటి వరకు ఎవరైనా చూశారా? అసలు దెయ్యం ఎలా ఉంటుంది.. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతారు కానీ.. ఎవ్వరూ సరిగ్గా చెప్పరు. ఎందుకంటే ఎవ్వరికీ దెయ్యం గురించి సరిగ్గా అవగాహన ఉండదు కాబట్టి. ఈ మధ్య టెక్నాలజీ విస్తృతంగా పెరిగిన తర్వాత దెయ్యాలను కెమెరాల్లో బంధించగలుగుతున్నాం. దెయ్యంపై ఓ క్లారిటీ వస్తున్నది. కానీ.. అవి అంతగా నమ్మబుల్ గా ఉండవు. కొన్ని ఫేక్ వీడియోలు ఉంటాయి. అయితే.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ గా మారింది. ఓ దెయ్యం గెంతుకుంటూ పొలాల్లోకి వెళ్లిపోతోంది. దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఘటన థాయ్ లాండ్ లో చోటు చేసుకున్నది. అక్కడ పొలాల మధ్య వెళ్తున్న కొంతమందికి ఈ దెయ్యం గెంతుకుంటూ వెళ్తూ కనిపించిందట. దీంతో వెంటనే తమ కెమెరాల్లో ఆ దెయ్యాన్ని బంధించారు. మరి.. అదన్నా నిజంగా దెయ్యమా అంటే ఏమో.. ఎవరికి ఎరుక. దెయ్యమో కాదో ఆ దేవుడికే తెలియాలి. మీరైతే వీడియో చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version