సలసలాకాగే నీళ్లను పైకి విసిరేసినా గడ్డకట్టుకుపోతున్నాయి.. వీడియో

-

ప్రస్తుతం యూఎస్‌లోని మిడ్‌వెస్ట్ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మైనస్ 50 నుంచి 60 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అంటార్కిటికాలో ఉన్న చలి కంటే ఎక్కువ చలి అక్కడ నమోదవుతున్నట్టు చెబుతున్నారు. ఇలా ఒక్కసారిగా అమెరికాలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి. దీంతో అక్కడి ప్రజలు బయటికి వెళ్లాలంటే గజగజా వణుకుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు అన్నీ మూతపడిపోయాయి. అందరూ ఇంట్లోనే ఉంటూ చలి నుంచి తమను తాము కాపాడుకుంటున్నారు. అయితే.. కొంతమంది ఔత్సాహికులు.. గడ్డ కట్టే చలిలో వింత ప్రయత్నాలు చేస్తున్నారు.

సలసలాకాగే నీళ్లను పైకి విసిరేసి జరిగే అద్భుతాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వేడి నీళ్లను పైకి విసిరేయగానే అవి మంచులా కిందికి రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. స్వెటర్ లేకుండా ఒక్క సెకన్ బయటికి వచ్చినా.. మనుషులు కూడా గడ్డకట్టుకుపోవడం ఖాయమని దీని ద్వారా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version