హహహ.. ఫోటో మోజులో పడి ఈ అతిథి ఏం చేశాడో చూడండి..!

-

పెళ్లంటే పందిళ్లు సందళ్ళు చప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు
అది ఒకప్పుడు.. ఇప్పుడు పెళ్లంటే ఫోటోలు, వీడియోలు. అప్పట్లో పెళ్లి అంటే కనీసం ఐదారు రోజులు జరుగుతుంది. చుట్టాలు కూడా రెండుమూడు రోజుల ముందే వెళ్లి పెళ్లి పనుల్లో పాల్గొనేవారు. మరి ఇప్పుడో.. పెళ్లికి గంట ముందు వెళ్లి.. పెళ్లి కాగానే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల మీద కొన్ని అక్షింతలు వేసి ఫోటోలకు పోజులిచ్చి ఇంత తిని అక్కడి నుంచి జారుకోవడమే. ఇది బిజీ లైఫ్ కదా. అందుకే పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లడానికి కూడా ఎవరికీ టైమ్ దొరకడం లేదు.

మనం అసలు విషయం వదిలేసి.. వేరే టాపిక్‌కి డైవర్ట్ అయ్యాం. అసలు విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి పెళ్లికి వెళ్లాడు. పెళ్లి అవగానే పెళ్లి జంటకు అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి మండపం ఎక్కాడు. మండపం ఎక్కాక ఫోటోలు దిగాలి కదా. ఇక.. అక్షింతల కోసం కింత ఉన్న ఓ చెంబును తీసుకున్నాడు. దాంట్లో ఏమున్నదో కూడా చూడలేదు. దాంట్లో అక్షింతలు ఉన్నాయనుకొని ఆ చెంబును వంచి కొంచెం పెళ్లి కూతురు మీద, ఇంకొంచెం పెళ్లి కొడుకు మీద పోయడం ప్రారంభించాడు. కిందికి చూడకుండా.. ఫోటోలకో పోజులిస్తూ మనోడు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? చెంబులో ఉన్న పాలను వాళ్ల మీద పోయడం. రెండు మూడు సార్లు వాళ్ల మీద పోస్తున్నా అవి అక్షింతలు కాదని కనిపెట్టలేకపోయాడు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వద్దని వారిస్తున్నా వినలేదు. చివరకు అక్కడున్న వాళ్లు అవి అక్షింతలు కాదనే సరికి తప్పయిపోయిందని చెప్పి తనలో తానే నవ్వుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూసి కాసేపు మీలో మీరే నవ్వేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version