బ్రెజిల్ బికినీ మోడ‌ల్ ఫొటోను లైక్ కొట్టిన పోప్‌.. వివ‌ర‌ణ అడిగిన‌ వాటిక‌న్‌..

-

వాటిక‌న్ సిటీలో ఉండే పోప్ ఫ్రాన్సిస్ చిక్కుల్లో ప‌డ్డారు. బ్రెజిల్‌కు చెందిన ఓ మోడ‌ల్ బికినీలో ఉన్న ఫొటోను ఆయ‌న ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా లైక్ కొట్టారు. అయితే పోప్ సాధార‌ణంగా త‌న సోష‌ల్ ఖాతాల‌ను తాను ప‌ర్య‌వేక్షించ‌రు. అందుకు వేరే టీం ఉంటుంది. ఆ టీంలో ఎవ‌రైనా ఇలా చేసి ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ విష‌యంపై విచార‌ణ చేప‌ట్టారు.

pope francis liked a model bikini photo vatican asks explanation

కాథ‌లిక్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పోప్ ఇన్‌స్టా ఖాతా నుంచి స‌ద‌రు మోడ‌ల్ ఫొటోకు ఎందుకు లైక్ వ‌చ్చిందో ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. స‌ద‌రు మోడల్ పేరు న‌టాలియా గ‌రిబొటొ కాగా ఆమె బికినీలో ఉన్న ఓ ఫొటోకు న‌వంబ‌ర్ 13న పోప్ ఇన్‌స్టా ఖాతా నుంచి లైక్ వ‌చ్చింది. అయితే విష‌యం అంద‌రికీ తెలిసి వైర‌ల్ కాగానే మ‌రుస‌టి రోజు ఆ ఫొటోను అన్‌లైక్ చేశారు.

కాగా ఈ విష‌యంపై మోడ‌ల్ న‌టాలియా స్పందిస్తూ త‌న ఫొటోకు పోప్ లైక్ కొట్ట‌డం సంతోషంగా ఉంద‌ని, తాను స్వ‌ర్గానికి వెళ్తున్నందుకు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాన‌ని.. జోక్ చేసింది. అయితే పోన్ ఇన్‌స్టా ఖాతా నుంచి ఆ ఫొటోకు లైక్ రావ‌డంపై వాటిక‌న్ సీరియ‌స్ అయింది. దీనిపై వివ‌ర‌ణ కావాల‌ని డిమాండ్ చేసింది. దీంతో పోప్ చిక్కుల్లో ప‌డ్డారు. ఇక త‌ప్పు ఎలా జ‌రిగిందో త్వ‌ర‌లోనే తెలిసే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news