గుడిలో పూజలు చేస్తూ జారి పడి మృతి చెందిన పూజారి.. వీడియో

-

తమిళనాడులోని నమక్కల్ లో ఉన్న ఓ గుడిలో పూజలు చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడి పూజారి మృతి చెందాడు. గుడిలో ఉన్న హనుమాన్ విగ్రహానికి పూల దండ వేయడానికి ఓ పూజారి మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకున్నాడు. హనుమంతుడికి పూల దండ వేసిన తర్వాత ఆయన కాలు జారడంతో మెట్ల నుంచి కింద పడ్డాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయై మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో గుడిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే.. ఈ ఘటనపై సోషల్ మీడియా చర్చ నడుస్తోంది. కొంతమంది ఆయన మృతికి సంతాపం ప్రకటించగా.. మరికొందరు నెటిజన్లు మాత్రం దేవుడికి పూజ చేస్తుండగా… ఆయన మృతి చెందితే.. దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version