యాత్రలో చంద్రబాబు.. ట్విస్ట్ అక్కడే ఉంది..!

-

వైఎస్సార్ బయోపిక్ గా వస్తున్న యాత్ర సినిమాను మహి వి రాఘవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. వైఎస్ పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న యాత్ర సినిమాలో వై.ఎస్.ఆర్ పాత్రలో మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న యాత్ర సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానంగా ఓ గొప్ప నాయకుడు గురించి చెప్పే టైంలో మరో నాయకుడి గురించి చెడుగా చూపించాల్సిన అవసరం లేదని సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర లేదని అన్నాడు మహి వి రాఘవ్. అంతేకాదు వై.ఎస్ బయోపిక్ లో జగన్ పాత్ర కూడా లేదని తెలుస్తుంది. క్లైమాక్స్ లో రియల్ ఫుటేజ్ వాడుతారట. నిన్న రిలీజైన యాత్ర మరుగైనావ రాజన్నా.. సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. రీసెంట్ గా వచ్చిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు నిరాశ పరచగా వైఎస్ బయోపిక్ గా వస్తున్న ఈ యాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version