వోల్కలో వంటలు చేస్తున్న రెస్టారెంట్..ఎంజాయ్ చేస్తున్న కస్టమర్లు..!

-

వంట ఎవరైనా గ్యాస్ స్టవ్ మీద చేస్తారు..లేదా కుక్కర్లోనే, వొవెన్ లోనో, ఎలక్ట్కిక్ స్టవ్ మీద ఇలా వీటిలో ఏదో ఒకదానిపై చేస్తారు..కానీ అగ్నిపర్వతం మీద వంట చేయడం ఏంటండి..వెరైటీగా ఉంది కదూ.అసలు అగ్నిపర్వతం అంటేనే అందరూ భయపడతారు..భగభగ మండే వోల్కనోనే స్టవ్ గా మార్చేసుకుని రెస్టారెంట్ నడుపుతున్నారు… ఇంతకీ ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉంది..ఎలా చేయగలగుతున్నారు అనేది చూద్దాం.

 స్పెయిన్ లోని టెగ్యూస్ (Teguise)లో ఉన్న ఎల్ డయాబ్లో (El Diablo Restaurant) రెస్టారెంట్ ఉంది. లాంజారోట్ (Lanzarote) అనే దీవిలో అగ్నిపర్వతంపై ఉంది. ఇందులోని చెఫ్‌లు… అగ్నిపర్వత కన్నంపై వంట వండుతారు. అసలు అగ్నిపర్వతంపై రెస్టారెంట్ ని నిర్మించడమే ఓ సాహసం. ఏదైనా భవనాన్ని నిర్మించాలంటే భూమిలో పునాదిని తవ్వుతారు కదా… ఇక్కడ అలా చెయ్యలేదు. ఆర్కిటెక్టులైన ఎక్వార్డో సెసెరెస్, జీసస్ సోటో… అగ్నిపర్వతంపై 9 పొరలుగా సున్నపు రాయిని వేశారు. దానిపై రెస్టారెంట్ ని నిర్మించారు.

రెస్టారెంట్ ని నిర్మించాక… అగ్నిపర్వత కన్నంపై చువ్వలతో ఓ పెద్ద గ్రిల్ సెట్ చేశారు. ఆ గ్రిల్ కి 6 అడుగుల కింద అగ్నిపర్వత లావా కుతకుతా ఉడుకుతూ ఉంటుంది. అది 400 డిగ్రీల వేడితో ఉంటుంది. మాంసాన్ని గ్రిల్ చేసేందుకు ఆ వేడి పర్ఫెక్టుగా సెట్ అవుతుందని అక్కడి ఛఫ్ లు చెప్తున్నారు.. ఈ లావా చిన్న చిన్న బుడగలతో ఉడుకుతూ ఉంటుంది. అందువల్ల పైగి ఎగజిమ్మదు. వేడి మాత్రమే పైకి వస్తుంది. అందువల్ల ఈ నేచురల్ స్టవ్ ఏర్పాటు చేయడానికి వీలైంది.

రెస్టారెంట్ నిర్వాహకులు అంతా బాగానే సెట్ చేశారు గానీ… కస్టమర్లు అక్కడికి వెళ్లి ఎలా తింటారు అనే డౌట్ మనకు రావచ్చు. ఆ అగ్ని పర్వతం 1824లో భారీగా బద్ధలైంది. ఆప్పటి నుంచి అది యాక్టివ్ గానే ఉన్నా… మళ్లీ బద్ధలవ్వట్లేదు. అందువల్లే అక్కడ ఈ రెస్టారెంట్ బిజినెస్ హాయిగా సాగుతోంది

ఈ రెస్టారెంట్ కి వెళ్లిన వారికి పానోరామిక్ వ్యూలో బయటి ప్రపంచం కనిపిస్తుంది. అక్కడి తిమన్ ఫాయా నేషనల్ పార్క్ (Timanfaya National Park) ని ఇక్కడి నుంచి చూడొచ్చు. అంతేకాదు… అగ్నిపర్వతం నుంచి వచ్చిన ఎర్రటి ఇసుక… ఎర్రటి మైదానంలా కనిపిస్తూ ఉంటుంది. అంగారక (Mars) గ్రహంపై ఉన్న ఫీల్ కలిగిస్తుంది. అందుకే టూరిస్టులు అక్కడికి వెళ్లి భలే ఎంజాయ్ చేస్తారు.

18వ శతాబ్దంలో దాదాపు 100 అగ్నిపర్వతాలు ఆ దీవిలో యాక్టివ్ గా ఉండేవి. ఇప్పటికీ వాటిలో కొన్ని యాక్టివ్ గానే ఉన్నా… ఏవీ బద్ధలవ్వట్లేదు. అందువల్ల ఈ రెస్టారెంట్… ప్రపంచంలోని ఇతర రెస్టారెంట్లకు భిన్నమైనదిగా గుర్తింపు పొందింది. ఏది ఏమైనా వాళ్లుక వచ్చిన ఐడియా సలామ్ కొట్టాల్సిందే.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version