ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు భారీ గా తగ్గుతుంది. రోజు వారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఈ రోజు కరోనా వైరస్ బులిటెన్ కాసెపటి క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కేవలం 27 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. అయితే శనివారం ఆంధ్ర ప్రదేశ్ లో 41 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అంటే నిన్నటి తో పోలిస్తే.. ఈ రోజు 17 కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. కాగ నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది కరోనా వైరస్ బాధితులు పూర్తి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 367 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాలు నమోదు కాలేదు. కాగ గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాపంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 8,948 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.