షాకింగ్” ఈ చెప్పులు చూసారా…?

-

ఏళ్ళ క్రితమే నాగరికత అనేది మనం ఊహించని విధంగా ఉందని పలు సందర్భాల్లో చరిత్రకారులు చెప్పినా సరే చాలా వరకు మనం వినే ప్రయత్నం చేయం. వాస్తవానికి ఎప్పుడో మనం చూడని మోడల్స్ బట్టలు, చెప్పులు అనేవి ప్రపంచానికి పరిచయ౦ అయ్యాయి. వందల ఏళ్ళ క్రితమే అప్పటి మనుషులు వాటిని ధరించారు. కాకపోతే మనకు తెలియక ఇప్పుడు వచ్చేవి న్యూ మోడల్స్ అని ఎగబడుతు ఉంటాం.

ఇప్పుడు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో చూస్తే, వందల ఏళ్ళ క్రితమే ఇప్పుడు మోడల్ గా భావిస్తున్న చెప్పులను ధరించారు. పురాతన భారతీయ పురుషులు బాటా ఇప్పుడు అమ్మే మాదిరిగానే చెప్పులు ధరించేటట్లు ఒక ఫోటో వైరల్ అవుతుంది. ట్విట్టర్ యూజర్, వి గోపాలన్ తమిళనాడులోని అవదయార్ కోయిల్ పట్టణంలోని ఒక పురాతన ఆలయం నుండి 900 సంవత్సరాల పురాతన శిల్పాల చిత్రాలను పోస్ట్ చేసారు.

“పురాతన భారతీయ పురుషులు శతాబ్దాల క్రితం చాలా నాగరీకమైనవారు! వారు వెయ్యి సంవత్సరాల క్రితం చెప్పులు ధరించారు – అదే ఈ రోజు BATA INDIA విక్రయించే మోడల్! సారూప్యతను చూడటానికి చిత్రాలను జూమ్ చేయండి! అవదయార్ కోయిల్,” అని ఆయన పోస్ట్ చేసారు. పురాతన భారతీయ పురుషులు ధరించే చెప్పులు ఈ రోజు బాటా విక్రయించే వాటితో సమానంగా ఉన్నాయని వాటిని చూస్తే అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news