ఇది మరీ టూ మచ్ బాస్’ పెళ్లి ఇలా కూడా ఆపేస్తారా…?

-

అద్రుష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందని ఒక సినిమాలో డైలాగ్. తాజాగా ఒక పెళ్లి క్యాన్సిల్ అయిన విధానం చూస్తే ఆ డైలాగ్ సరిగా సరిపోతుంది. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఒక యువకుడు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా తనకు సంబంధం వెతుక్కున్నాడు. అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఆగస్ట్ లో ఇండియా వచ్చింది. ఇద్దరికీ లైన్ క్లియర్ అయింది. అమ్మాయి అమెరికా నుంచి రాగానే ఇద్దరు ఒక స్టార్ హోటల్ లో కలిసి ప్రేమ లేదు ఎం లేదు పెళ్లి చేసేసుకు౦దా౦ అనుకుని ఒప్పుకున్నారు.

దీనితో గత ఏడాది ఆగస్ట్ 26 న అబ్బాయి రమేష్ తల్లి తండ్రులు బెంగుళూరులోని అమ్మాయి ఇంటికి వెళ్లి ఆమె తల్లి తండ్రులతో మాట్లాడి సెప్టెంబర్ 9న వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అదే రోజున 2020 జనవరి 30న పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకుని పెళ్లి తిరుపతిలో చెయ్యాలని యువతీ కుటుంబం పట్టుబట్టడంతో యువకుడి కుటుంబ౦ ఒప్పుకుంది. తిరుపతిలో పెళ్ళికి ఏర్పాట్లు చేసుకున్న రమేష్ బంధు మిత్రుల కోసం 70 రూమ్‌లు బుక్ చేసి లక్ష అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు.

4 లక్షలు పెట్టి బట్టలు కొనుక్కుని రెడీ అయ్యాడు. ఇంతలో అమ్మాయి అమెరికా వెళ్లిపోయింది. అక్టోబర్‌లో ఒక రోజు ఫోన్ చేసి పెళ్లి రద్దు అని చెప్పగా ఎందుకని అడిగాడు, ముక్కు బాలేదని చెప్పి సర్జరీ చేయించుకో అని సలహా ఇచ్చేసింది. కొన్ని రోజులకు యువకుడి నెంబర్ బ్లాక్ చేయడంతో ఆమె కుటుంబం కావాలనే ఇలా చేసిందని భావించి కోర్ట్ లో కేసు వేసాడు. ఇలాగే చాలా మందితో ఆడుకుని ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసి కోర్ట్ లో ఫిర్యాదు చేయడంతో కోర్ట్ ఆదేశాల మేరకు యువతీ, ఆమె తల్లి తండ్రులపై క్రిమనల్ కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news