సిమ్మర్ డేటింగ్.. ప్రపంచమంతా ఫాస్ట్ గా మారిపోతోంది. ఇన్ఫర్మేషన్ మొత్తం సెకండ్లలో తెలిసిపోతోంది. డేటింగ్ యాప్స్ వచ్చేసి ఈజీగా బంధాలను కలిపేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సిమ్మర్ డేటింగ్ ట్రెండ్ అవుతోంది.
సిమ్మర్ డేటింగ్ అంటే:
ఈ ట్రెండ్ లో బంధం స్లోగా బలపడుతుంది. నచ్చిన వాళ్ళు కనిపించగానే అమాంతం మెసేజ్ పెట్టేయడం, ఆ తర్వాత కాఫీకి కలుసుకోవడం, బంధం కొనసాగించడం లాంటివి ఉండవు.
సిమ్మర్ డేటింగ్ లో ప్రత్యేకత అదే. ఇక్కడ బంధం చాలా నెమ్మదిగా కుదురుతుంది. ప్రస్తుతం యువత దీనిమీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి డేటింగ్ ట్రెండ్ లో అవతలి వాళ్ల గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉందని నేటితరం యువత చెబుతోంది. అంతేకాదు ఇలాంటి రకం బంధం చాలా దృఢంగా ఉంటుందని వాళ్లు చెబుతున్నారు.
అందుకే ప్రపంచం ఫాస్ట్ గా పరిగెడుతున్నప్పటికీ స్లోగా సాగే సిమ్మర్ డేటింగ్ ని యువత ఎంచుకుంటుంది.
సిమ్మర్ డేటింగ్ వల్ల లాభాలు:
ఈ రకమైన డేటింగ్ లో అవతలి వ్యక్తి గురించి అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల బంధంలో ముందుకు వెళ్లాలా, వద్దా అనేది తెలిసిపోతుంది. ఇలా తెలియడం వల్ల అనవసరంగా హార్ట్ బ్రేక్స్ లాంటివి ఉండవు.
ఒకవేళ సిమ్మర్ డేటింగ్ లో అవతలి వ్యక్తులను లక్షణాలు మీకు నచ్చినట్లయితే మీరు ఈజీగా డ్రాప్ అవ్వచ్చు.
పూర్తి కాన్సన్ట్రేషన్ డేటింగ్ మీదనే ఉండదు కాబట్టి వ్యక్తిగతంగా ఎదిగేందుకు సమయం ఉంటుంది.