జపాన్ దేశ ప్రజల ఆయుర్దాయం దాదాపు 85 సంవత్సరాలు ఉంటుంది. జపాన్ దేశంలోనే అత్యధికంగా ముసలి వాళ్లు ఉన్నారు. వంద సంవత్సరాలకు పైబడిన వారు ఎక్కువ సంఖ్యలో జపాన్ లోనే ఉన్నారు. మరి వాళ్ళ జీవితకాలం ఎక్కువగా ఉండటానికి కారణాలు ఏంటో ప్రస్తుతం తెలుసుకుందాం.
డైట్:
జపాన్ ప్రజలు ఎక్కువగా సముద్రపు ఆహారాన్ని తీసుకుంటారు. ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అంతేకాదు.. క్యాన్సర్లకు కారణమయ్యే రెడ్ మీట్ తక్కువగా తింటారు. మొక్కల నుంచి వచ్చే ఆహారాలైన సోయా వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు.
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరోకటి ఉంది. వాళ్ళు తాజా ఆహారం తీసుకుంటారు. అప్పుడే వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనవసర ఇబ్బందులు రావు.
లైఫ్ స్టైల్:
జపాన్ దేశ ప్రజలను లైఫ్ స్టైల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అక్కడ వ్యక్తిగత వాహనాలు తక్కువగా వాడుతారు. నడక ఎక్కువగా చేస్తారు, అంతేకాదు.. ధ్యానం వారి జీవితంలో ప్రధానంగా ఉంటుంది.
చిన్న ప్లేట్లలో భోజనం:
జపాన్ దేశ ప్రజలు భోజనం చేయడానికి చిన్న చిన్న ప్లేట్లను ఉపయోగిస్తారు. దీనివల్ల ఆహారం ఎక్కువగా తినరు. ఆరోగ్యంగా ఉండాలంటే కడుపు నిండా తినకూడదు. జపాన్ దేశ ప్రజలు 80% వరకు మాత్రమే తింటారు. 20% కడుపుని ఖాళీ ఉంచుకుంటారు.
హెల్త్ కేర్:
జపాన్ దేశ ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. రెగ్యులర్ గా చెకప్స్ కి వెళ్తుంటారు. దీనివల్ల శరీరంలో ఎలాంటి రోగాలనైనా తొందరగా పసిగట్టవచ్చు.
జీన్స్:
పైన చెప్పుకున్న కారణాలన్నీ జపాన్ ప్రజలు ఎక్కువ కాలం బ్రతకడానికి కారణాలు వాటితో పాటు వారి జీన్స్ కూడా ఒక కారణమే.