కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి గతేడాది ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షలో డిస్టింక్షన్ సాధించాడు. కానీ ఇప్పుడు మాత్రం పబ్‌జి మొబైల్ గేమ్‌కు బానిస అయ్యాడు. దీంతో సబ్జెక్టులు సరిగ్గా చదవలేదు.
మన దేశంలో పబ్‌జి గేమ్ ఆడుతున్న వారి పిచ్చి పీక్స్‌కు చేరుతోంది. ఆ గేమ్ మాయలో పడి ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియడం లేదు. తాజాగా కర్ణాటకలో ఓ విద్యార్థి పరీక్ష పత్రాల్లో ప్రశ్నలకు జవాబులు రాయాల్సింది.. పబ్‌జి గేమ్‌పై వ్యాసం రాశాడు. దీంతో అతను ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో ఈ వార్త ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది.
కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి గతేడాది ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షలో డిస్టింక్షన్ సాధించాడు. కానీ ఇప్పుడు మాత్రం పబ్‌జి మొబైల్ గేమ్‌కు బానిస అయ్యాడు. దీంతో సబ్జెక్టులు సరిగ్గా చదవలేదు. అదే పనిగా పబ్‌జి ఆడుతూ పరీక్షల విషయమే మరిచిపోయాడు. తీరా పరీక్షలు దగ్గరకు వచ్చే సరికి అతనికి ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే అతను ఇటీవలే జరిగిన ఎకనామిక్స్ ఎగ్జామ్‌లో ప్రశ్నలకు జవాబులు రాయాల్సింది పోయి.. పబ్‌జిని ఎలా డౌన్‌లోడ్ చేయాలి ? ఎలా ఆడాలి ? అని వివరంగా వ్యాసం రాశాడు.
అయితే ఆ విద్యార్థి అలా రాయడంతో ఆ పేపర్ దిద్దిన ఎగ్జామినర్‌కు దిమ్మ తిరిగింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని సంబంధిత కళాశాలకు తెలపగా వారు ఆ విద్యార్థి తల్లిదండ్రులను పిలిపించి జరిగిన విషయం చెప్పారు. దీంతో షాక్ అవడం ఆ తల్లిదండ్రుల వంతైంది. అయితే ఇలా ఎందుకు చేశావని ఆ విద్యార్థిని అడగ్గా.. తాను పరీక్షలకు అస్సలు చదవలేదని, ఎప్పుడూ క్లాసులకు డుమ్మా కొట్టి పబ్‌జి ఆడేవాన్నని, దీంతో పరీక్షలో ప్రశ్నలకు ఏం సమాధానాలు రాయాలో తెలియక.. పబ్‌జి మొబైల్ గేమ్‌పై వ్యాసం రాశానని చెప్పాడు.. ఏది ఏమైనా.. ఇప్పుడీ సంఘటన మాత్రం నెట్‌లో వైరల్ అవుతోంది..!