సహజంగా పిల్లలకు సెలవలు వచ్చినా లేదా ఖాళీగా ఉన్నా టక్కుమని ఫోన్ పట్టుకుని గేమ్స్ ఆడుతుంటారు. ప్రస్తుత సమాజంలో ఫోన్ పిల్లలకు ఓ స్నేహితుడిగా మరిపోయింది. గంటల తరబడి ఫోన్‌తోనే కూర్చుంటున్నారు. కనీసం సెలవుల రోజున కూడా బయటకు వెళ్లి ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్న దాఖలాలే కనిపించడం లేదు. వాస్తవానికి పిల్లలనే కాదు పెద్దలు కూడా అదే పని చేస్తున్నారు.
పబ్‌జీ, పోకేమాన్ వంటి గేమ్స్‌కు చాలా మంది ఎడిక్ట్ అవుతున్నారు. అలాగే ఈ గేమ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే పాఠశాలల్లో గంటల తరబడి పబ్‌జీ ఆడుతున్నారని గుజరాత్ ప్రభుత్వం ఆ గేమ్‌ను బ్యాన్ చేసింది. ఫోన్‌లో గేమ్స్‌ని వ్యసనంగా మార్చుకుని జీవితాలను కోల్పోతున్నారు. కానీ.. పశ్చిమబెంగాల్‌లోని ఓ స్కూల్ విద్యార్థులు మాత్రం వీటికి చాలా భిన్నంగా ఉన్నారు.
వీళ్లు పిల్లలా.. చిచ్చర పిడుగులా అన్న విధంగా అందరని ఆకర్షిస్తున్నారు. ఇటీవల ఓ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ టాలెంట్ ఎంటో నిరూపించారు. ఈ ఇద్దరు విద్యార్థులు రోడ్డుపై ఒకర్ని మించిన మరొకరు చేసిన ఫిట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఐఏఎస్ అధికారి ఎంవీ రావు ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.
ఈ వీడియోలో ఆ పిల్లలు ఇద్దరు రోడ్డుపై ఒకేసారి గాల్లో పల్టీలు కొట్టారు. ఇది చూసిన నెటిజన్లు వాళ్లకు ప్రశంసలు కురిపించారు. అయితే రోడ్డుపై ఇలాంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరమని సూచించారు.