`సాహో` ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లివే..!

-

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెర‌కెక్క‌బోయే `సాహో` ఈ నెల ఆగ‌ష్టు 30న విడుద‌ల కానుంది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ తెర‌కెక్క‌బోతుంది. `సాహో` ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రిగింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జ‌రిగింది.

saaho pre release business Details
saaho pre release business Details

ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌ ప‌నుల్లో బీజీగా ఉంది. అయితే ఈ చిత్రాన్ని 319 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్మారు. మిగిలిన మొత్తాన్ని శాటిలైట్, డిజిటల్, ఆడియో రూపంలో రికవరీ చేసుకుంటారు. ఈ సినిమా ట్రైలర్‌కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

సాహో చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 330 కోట్ల రూపాయలు సాధించాలి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. ఏ మాత్రం తేడా వ‌చ్చినా న‌ష్టాలు భారీగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే బ‌య‌ట డిస్ట్రిబ్యూటర్ల క‌న్నా యూవీ క్రియేషన్స్ నిర్మాతల‌కే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది.

ఎందుకంటే హై బడ్జెట్ తో తీసిన ఈ సినిమాను చాలా ఏరియాల్లో వీళ్లు సొంతంగా విడుద‌ల చేస్తున్నారు. అలాగే ఎంతో ధైర్యంతో భారీ మార్కెట్ కలిగిన నైజాంలో కూడా సొంతంగా రిలీజ్ చేస్తుండ‌డంతో ఆశ్చ‌ర్యాన్ని గురి చేసింది. ఇది ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సాహో ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 40 కోట్లు (యూవీ సొంత రిలీజ్)

సీడెడ్ – రూ. 25 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 16 కోట్లు

ఈస్ట్ – రూ. 11 కోట్లు

వెస్ట్ – రూ. 8.5 కోట్లు

కృష్ణా – రూ. 8.5 కోట్లు (యూవీ సొంత రిలీజ్)

గుంటూరు – రూ. 11.50 కోట్లు (యూవీ సొంత రిలీజ్)

నెల్లూరు – రూ. 4.50 కోట్లు (యూవీ సొంత రిలీజ్)

Read more RELATED
Recommended to you

Latest news