టెలిఫోన్ కేబుల్ రూపంలో నెక్లెస్‌.. ధ‌ర ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

Join Our Community
follow manalokam on social media

నేటి ఆధునిక యుగంలో భిన్న ర‌కాల ఫ్యాష‌న్ ఉత్ప‌త్తులు ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది ర‌క ర‌కాల యాక్స‌సరీలు, దుస్తులు, ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తున్నారు. నిత్యం ఫ్యాష‌న్ గా ఉండేందుకు య‌త్నిస్తున్నారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. మ‌రీ ఫ్యాష‌న్ పేరు చెప్పి కొంద‌రు వింతైన వ‌స్తువుల‌ను, ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తున్నారు. తాజాగా ఇలాగే ఓ ఫ్యాష‌న్ ప్రొడ‌క్ట్ ట్రెండ్ అవుతోంది. అది ఏంటా అని చూస్తే.. టెలిఫోన్ కేబుల్‌.. అవును.. అదే..

telephone cable necklace cost

ఇట‌లీకి చెందిన ల‌గ్జ‌రీ బ్రాండ్స్ త‌యారీదారు బొట్టెగా వెనెటా షాకింగ్ ఆభ‌ర‌ణాన్ని విక్ర‌యిస్తోంది. అది చూసేందుకు అచ్చం ల్యాండ్ లైన్ ఫోన్ కేబుల్‌ను పోలి ఉంటుంది. ఫోన్ నుంచి రిసీవ‌ర్‌ను క‌లిపే కేబుల్ లా ఉంటుంది. కానీ దాన్ని భిన్న ర‌కాల లోహాల‌తో త‌యారు చేశారు. ఇక ఆ ఆభ‌ర‌ణం ఖ‌రీదు అక్ష‌రాలా 2వేల డాల‌ర్లు. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.1,45,189 అన్న‌మాట‌. ఆ కేబుల్ ఆభ‌ర‌ణంతోపాటు మ్యాచింగ్ ఇయ‌ర్ రింగ్స్ ను కూడా క‌లిపి ఇస్తారు.

ఆ కేబుల్ నెక్లెస్‌ను ఆ బ్రాండ్‌కు చెందిన ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే ఆ నెక్లెస్‌ను చూసిన నెటిజ‌న్లు దానిపై జోకులు పేలుస్తున్నారు. ఇది ఒక ఫ్యాష‌నా ? టెలిఫోన్ కేబుల్‌ను కొనాలా ? ఇంత‌కు మించిన ద‌రిద్రం ఇంకొక‌టి లేదు, ఇది నిజంగా దోపిడీయే.. అని కామెంట్లు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...