ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు చూపిస్తోంది. ఈసారి టీఆర్ఎస్ కి మెరుగైన ఫలితాలు రావని ప్రచారం జరిగినా సరే అందుకు భిన్నంగా ఫలితాల ట్రెండ్స్ వెలువడుతున్నాయి. ముందుగా మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ ముగిసే సమయానికి మొత్తం 105280 ఓట్లలో టీ.ఆర్ ఎస్. అభ్యర్థి ఎస్. వాణి దేవికి 35171 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించగా , ద్వితీయ స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 32558 ఓట్లు, తృతీయ స్థానంలో డా|| నాగేశ్వర్ కు 16951 , కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి కి 10062, టిడిపి అభ్యర్థి ఎల్ రమణ కు 1811 ఓట్లు లభించాయి. అదేవిధంగా చెల్లని ఓట్లు మొత్తం 6749 నమోదయ్యాయి.
ఇక నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే మూడవ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా.. రాజేశ్వర్ రెడ్డి ..15,558 ఓట్లు, తీన్మార్ మల్లన్న 11,742, కోదండరాం 11039, బీజేపీ 5320 వోట్లు సాధించాయి. మూడో రౌండ్ లో..టీఆర్ఎస్ లీడ్ 3,816గా ఉంది. ఇప్పటి వరకు వెలువడిన మూడు రౌండ్స్ లో టోటల్ వచ్చిన ఓట్లు చూస్తే టీఆర్ఎస్ పల్లా 47,545, మల్లన్న 35,858, కోదండరాం 29,557, బీజేపీ 18,604గా ఉన్నాయి.