ఎన్నో ఊర్లు ఉంటాయి. కానీ ఇలాంటి వింత ఊరు ఎక్కడ ఉండదు. ఈ ఊరు గురించి చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ ఊరు చూడడానికి మనిషి ఆకారంలో ఉంటుంది. మరి ఆ వింత ఊరు గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తి చూసేయండి.
ఈ ఊరు మనిషి ఆకారంలో ఉంటుంది. డ్రోన్ కెమెరా ని ఉపయోగించి ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలు తీశారు. చూడడానికి ఈ ఊరు ఇక్కడ ఫోటో లో ఉన్న మాదిరి ఉంటుంది. గూగుల్ ఎర్త్ లో తమ పట్టణం మ్యాప్‌ను చూసి మనిషి బొమ్మలా ఉందే అని ఆ ఫోటోగ్రాఫర్ అనుమానం పడ్డాడు. ఇంకేముంది అనుమానాన్ని కాస్త తీర్చుకుందామని ఊరికి ఫోటో తీశాడు. చూస్తే ఏముంది చూడడానికి మనిషి ఆకారం లోనే ఉంది.
ఆ ఊరు ఎక్కడో కాదు. ఇటలీలోని ఒక సెంటూరిపే అనే చిన్న పట్టణం. ఆ చిన్న ఊరు చూడడానికి మనిషి ఆకారంలో ఉంటుంది. ఫోటోగ్రాఫర్ తీసిన ఈ ఫోటో ని చాలా మంది గ్రామస్తులు కూడా నమ్మలేదు. ఏదో క్రియేట్ చేశాడు అన్నట్లు మొదట బ్లేమ్ చేశారు. కానీ తర్వాత గూగుల్ మ్యాప్ లో ఉన్న ఊరిని చూస్తే మనిషి ఆకారం లోనే ఉంది. ఈ ఊరిలో ఐదు వేల మంది వరకు ఉంటారు. సెంటూరిపే సముద్రమట్టానికి 2,400 అడుగుల ఎత్తులో ఉంటుంది.