ఆ పాఠశాలలో 76 మంది కవలలు.. కన్ఫ్యూజన్‌లో టీచర్లు, పనిష్మెంట్లు తప్పించుకుంటున్న స్టూడెంట్స్‌

-

కవల పిల్లలను చూస్తే మనం భలే ఆశ్చర్యపోతాం కదా.. వాళ్ల పోలికలు మొత్తం ఒకేలా ఉంటాయి. పైగా కవలపిల్లలంతా డ్రెస్సులు ఎప్పుడూ ఒకటే వేసుకుంటారు. ఇంకా కన్ఫ్యూజ్‌ చేయడానికి. అలాంటిది ఒకేచోట 76 మంది కవలలను చూస్తే. ఆ స్కూళ్లో ఒకే పోలికతో అంత మంది ఉంటారట.. ఇమాజిన్‌.. ఎంతమంది రోజుకు ఎన్నిసార్లు కన్ఫ్యూజ్‌ అవుతారో. టీచర్లు కూడా ఒకరికి ఇవ్వాల్సిన పనిష్మెంట్‌ ఒక్కోసారి వేరేవాళ్లకు ఇస్తారట. ఇంతకీ ఆ స్కూల్‌ ఎక్కడ ఉందంటే…

పంజాబ్‌లోని జలంధర్‌లో పోలీస్‌ డీఏవీ స్కూల్‌ ఇప్పుడు బాగా ఫేమస్‌ అయింది. ఎందుకంటే ఈ స్కూల్‌లో చదివే స్టూడెంట్స్‌లో చాలా మంది ఒకరిని పొలి మరొకరు ఉంటారు. అంటే కవల పిల్లల మాదిరిగా ఉంటారు. స్కూల్‌లో చదువుకునేందుకు వచ్చే అబ్బాయిలు, అమ్మాయిలు పోలికలు దగ్గరగా కనిపిస్తాయి. ఈ పాఠశాలలో చాలా మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి వస్తుంటారు. అందులో 76 మంది విద్యార్థులు సేమ్ టు సేమ్ ఉంటారు. అంటే వాళ్లంతా కవలలు. అలాగే మూడు జంటలు కూడా ఉన్నాయి. వారి ముఖాలు ఒకేలా ఉన్నాయి. వీళ్లంతా బ్రదర్స్ మరియు సిస్టర్సే.

పోలీసు డిఎవి పాఠశాలను సందర్శించినప్పుడు ఒకరి ముఖాలు ఒకదానికొకటి పోలిన చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో కొందరు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, కొన్నిసార్లు మనలాగే కనిపించే వారిని కఠినంగా శిక్షిస్తారని చెప్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు తమను ఎలా మందలించారో, ఎంత కఠినంగా శిక్షించారో కూడా కథలు కథలుగా చెప్తున్నారు. ఇంత మంది కవలలు ఉండటం వల్లే.. తమ పాఠశాల పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైనట్లుగా ప్రిన్సిపల్‌ తెలిపారు.

కర్ణాటకలోని మంగళూరు శివారులో కైరంగల పుణ్యకోటినగరలో ఉన్న శారద గణపతి విద్యా కేంద్రం కవల పిల్లల పాఠశాలగా ప్రత్యేక గుర్తింపు తెచ్చకుంది. ఆ పాఠశాలలో తొలిసారిగా 2008లో కవలలు చేరారు. ప్రస్తుతం అక్కడ 11 కవల జంటలున్నాయి. ఇంతమంది కవలలను చూసి ఉపాధ్యాయులు సహా విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version