అది దెయ్యాల గ్రామం.. అక్క‌డికి వెళ్లిన వారు తిరిగి రాలేదు..

-

దెయ్యాలంటే స‌హ‌జంగానే చాలా మందికి భ‌యం క‌లుగుతుంది. దెయ్యం పేరు చెబితేనే కొంద‌రు జ‌డుసుకుంటారు. అయితే దెయ్యాలు ఉన్న ఒక పురాత‌న గ్రామ‌మే ఉంది తెలుసా. ఆ గ్రామంలో జ‌నాలు ప్ర‌స్తుతం ఉండ‌డం లేదు. కానీ అక్క‌డ దెయ్యాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో అక్క‌డికి ఎవ‌రూ వెళ్ల‌డం లేదు.

this is ghost village nobody came out live

ర‌ష్యాలోని ఉత్త‌ర ఒస్సెటియా అనే ప్రాంతంలో ఉన్న ద‌ర్గావ్స్ అనే గ్రామంలో 100 వ‌ర‌కు పురాత‌న స‌మాధులు ఉంటాయి. ఆ గ్రామం విస్తీర్ణం సుమారుగా 17 కిలోమీట‌ర్లు ఉంటుంది. అక్క‌డ ఎన్నో పురాత‌న భ‌వ‌నాలు ఖాళీగా క‌నిపిస్తాయి. అయితే ఆ గ్రామంలో దెయ్యాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్ప‌టికీ అక్క‌డి జ‌నాలు కూడా అదే నమ్ముతారు. దీంతో అస‌లు అటు వైపు ఎవ‌రూ వెళ్ల‌డం లేదు. అక్క‌డికి వెళ్లి తిరిగి వ‌చ్చిన వారు కూడా ఎవ‌రూ లేర‌ని అంటారు.

అక్క‌డ ఒక‌ప్పుడు చాలా మంది నివాసం ఉండేవారు. కానీ దెయ్యాలు ఉన్నాయ‌నే భ‌యానికి ఆ గ్రామాన్ని ఖాళీ చేశారు. అయితే ఇప్ప‌టికీ కొంద‌రు ఔత్సాహికులు అక్క‌డ దెయ్యాలు ఉన్నాయా, లేవా అనే విష‌యాన్ని తెలుసుకోవ‌డం కోసం అక్క‌డికి వెళ్తుంటార‌ట‌. కానీ అక్క‌డికి వెళ్లిన వారు ఎవ‌రూ ఇప్ప‌టికీ తిరిగి రాలేద‌ని స్థానికులు చెబుతారు. ఆ గ్రామంలో ఉన్న శ్మ‌శాన‌వాటిక‌లో బావులు ఉంటాయి. చ‌నిపోయిన త‌మ ఆత్మీయులు ఆ బావి గుండా స్వ‌ర్గానికి వెళ్లేవార‌ని అప్ప‌ట్లో న‌మ్మేవారు. అందులో కొంద‌రు నాణేల‌ను వేసి కోర్కెల‌ను తీర్చ‌మ‌ని కోరుకుంటారు. అయితే ఆ గ్రామంలో దెయ్యాలు ఉన్నాయా, లేవా, ఉంటే అస‌లు అందుకు కార‌ణాలు ఏమిటి ? అనే వివ‌రాలు మాత్రం తెలియ‌వు. కానీ జ‌నాలు ఆ గ్రామం పేరు చెబితేనే భ‌య‌ప‌డ‌తారు.

Read more RELATED
Recommended to you

Latest news