షాకింగ్‌.. అత‌ని శ‌రీరంలో అవ‌య‌వాలు ఉండాల్సిన చోట‌ లేవు..!

ఉత్త‌ర‌ప్రదేశ్‌లోని కుషి న‌గ‌ర్ ప‌ద్రౌనా ప్రాంతానికి చెందిన జ‌మాలుద్దీన్ అనే వ్య‌క్తికి ఇటీవ‌లే క‌డుపునొప్పి ఎక్కువ అవ‌డంతో హాస్పిట‌ల్‌లో చూపించుకున్నాడు. అత‌నికి అవ‌యవాలు ఉండాల్సిన చోట కాకుండా వేరే భాగాల్లో ఉన్నాయి.

మ‌న శ‌రీరంలో ఏయే అవ‌య‌వాలు ఏయే భాగాల్లో ఉండాలో.. అక్క‌డే ఉండాలి. ఉంటాయి కూడా. గుండె ఎడ‌మ వైపు, లివ‌ర్ కుడివైపు ఉండాలి. ఇక మిగిలిన అవ‌య‌వాలు కూడా వాటి వాటి స్థానాల్లో ఉండాలి. కానీ ఆ వ్య‌క్తికి మాత్రం అలా కాదు. అవ‌య‌వాల‌న్నీ తారుమారుగా ఉన్నాయి. కుడి ప‌క్క‌న ఉండాల్సిన‌వి ఎడ‌మ‌వైపు, ఎడ‌మ ప‌క్క‌న ఉండాల్సిన‌వి కుడివైపు ఉన్నాయి. దీంతో ఆ వ్య‌క్తి స్థితి తెలుసుకున్న డాక్ట‌ర్లు షాక్‌కు గుర‌వుతున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

this mans organs are in different positions in his body

ఉత్త‌ర‌ప్రదేశ్‌లోని కుషి న‌గ‌ర్ ప‌ద్రౌనా ప్రాంతానికి చెందిన జ‌మాలుద్దీన్ అనే వ్య‌క్తికి ఇటీవ‌లే క‌డుపునొప్పి ఎక్కువ అవ‌డంతో హాస్పిట‌ల్‌లో చూపించుకున్నాడు. అయితే అత‌నికి ప‌రీక్ష‌లు చేసిన వైద్యులు అత‌ని రిపోర్టుల‌ను చూసి ఖంగు తిన్నారు. ఎందుకంటే అత‌నికి అవ‌యవాలు ఉండాల్సిన చోట కాకుండా వేరే భాగాల్లో ఉన్నాయి. అతని గుండె కుడి వైపు ఉండ‌గా, లివ‌ర్‌, గాల్ బ్లాడ‌ర్ ఎడ‌మ వైపు ఉన్నాయ‌ని గుర్తించారు. అత‌నికి గాల్ స్టోన్స్ ఉన్నాయ‌ని కూడా అల్ట్రా సౌండ్ ప‌రీక్ష‌ల్లో తేలింది. దీంతో డాక్ట‌ర్ల‌కు అత‌నికి స‌ర్జ‌రీ చేయ‌డం స‌వాల్‌గా మారింది.

అయితే జ‌మాలుద్దీన్‌కు ఉన్న గాల్ స్టోన్స్‌ను తీసేయ‌డానికి వైద్యులు అత‌ని శ‌రీరాన్ని 3డీలో లాప‌రోస్కోపిక్ యంత్రాల స‌హాయంతో చిత్రీక‌రించి ఆ త‌రువాత విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ చేశారు. కాగా కొన్ని అరుదైన ప‌రిస్థితుల్లో మాత్ర‌మే ఇలాంటి స్థితి కొందరిలో ఉంటుంద‌ని, దీన్ని సైట‌స్ ఇన్వెర్స‌స్ (Situs Inversus) అని అంటార‌ని, 1643లో కేవ‌లం ఒక్క వ్య‌క్తిలోనే ఇలాంటి స్థితి చూశార‌ని, ఆ త‌రువాత ఇప్పుడు జ‌మాలుద్దీన్‌లోనే ఇలాంటి ప‌రిస్థితి చూస్తున్నామ‌ని వైద్యులు వెల్ల‌డించారు. అయితే ఇప్పుడు సర్జ‌రీ సాఫీగానే సాగినా.. భ‌విష్య‌త్తులో మ‌రేదైనా సంద‌ర్భంలో ఇత‌నికి స‌ర్జ‌రీ చేయాల్సి వ‌స్తే అప్పుడు ఇంకా క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. జ‌మాలుద్దీన్ లాంటి ప‌రిస్థితి ఎవ‌రికీ రాకూడ‌దు క‌దా..!