హెచ్చ‌రిక‌ల‌కు బెద‌ర‌ని కార్మికులు.. రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

-

ఆర్టీసీ కార్మికుల సమ్మె ను సీరియస్‌ గా తీసుకున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై కసరత్తు చేపట్టింది. ఆర్టీసీ డ్రైవర్లు శ‌నివారం సాయంత్రం 6 గంటల్లోపు విధుల్లోకి రాకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ హెచ్చ‌రిక‌ల‌కు ఏ మాత్రం బెద‌ర‌కుండా రెండో రోజు కూడా ఆర్టీసీ స‌మ్మె కొన‌సాగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌ ముగిసేసరికి దాదాపు 50 వేల మంది ఉద్యోగుల్లో 160 మంది మాత్రమే విధుల్లో చేరారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి.. పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. దసరా, బతుకమ్మ పండుగల ముందు అల్లాడిపోయారు. బస్టాండ్లలోనే గంటలకొద్దీ పడిగాపులు కాశారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు అందినకాడికి దోచుకున్నారు. కాగా, డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదలలేదని, సమ్మె 100 శాతం విజయవంతమైందని కార్మిక జేఏసీ ప్రకటిస్తే.. 9000కుపైగా బస్సులను నడిపామని, ప్రయాణికులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూశామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక, సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం సమీక్షించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news