అమెరికాలోని న్యూజెర్సీలోని జంతుప్రదర్శనశాలలో, కుక్క చిరుత పులి కలిసి జీవిస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. “బౌవీ” లాబ్రడార్ రిట్రీవర్ మరియు “నంది” చిరుతలు రెండూ కొన్ని వారాల వయస్సు నుండి కలిసి కలిసి పెరిగాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే కాకుండా ఆ రెండింటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఒక నివేదిక ప్రకారం చూస్తే, యుఎస్ జంతుప్రదర్శనశాలలలో చిరుతలలో ఆత్మ విశ్వాసం పెంచడానికి గానూ చిన్న చిరుతలను కుక్కలతో పెంచుతూ ఉంటారు. దేశంలోని చాలా జంతుప్రదర్శనశాలలు ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉంటాయి. దీని ద్వారా వేటాడే గుణం తగ్గి అవి కూల్ గా ఉంటాయని భావిస్తూ ఉంటారు. “ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం బలమైన బంధాన్ని సృష్టిస్తుంది అని అధికారులు వివరించారు.
కుక్కలు చిరుత పులులకు తోబుట్టువులుగా ఉంటాయని అంటున్నారు. దాని ద్వారా వాటి కాన్ఫిడెన్స్ లెవల్ కదా క్రమంగా పెరుగుతుంది అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవ్వడమే కాకుండా ఆ రెండు పిల్లలను కనే అవకాశం ఉందా అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇది మంచి ప్రయత్నం అని అవి చూడటానికి ముద్దుగా ఉన్నాయని భవిష్యత్తులో చిరుత కుక్కను చంపితే ఏంటీ పరిస్థితి…? అని కామెంట్లు చేస్తున్నారు.