వైరల్ వీడియో : చిన్నారిని కిడ్నాప్ చేసిన కోతి…!

-

కోతి చేష్టలు అని ఊరికనే అనరు కదూ… మన కళ్ళ ముందు కొన్ని కోతులు చేసే సంఘటనలు బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు కోతులు దూకడం, మన ఇళ్ళ వద్ద ఏమైనా వస్తువులు ఉంటే వాటిని లాక్కుని పోవడ౦, మనం ఏదైనా తింటూ ఉంటే దాన్ని చేతిలో నుంచి లాక్కోవడ౦ వంటివి కోతులు చేస్తూ ఉంటాయి. కాని కోతి చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడం చూసారా…?

నిజం మాస్టారూ… కోతి ఒక చిన్న పిల్లను కిడ్నాప్ చేసింది. ఎక్కడో తెలియదు గాని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో లో ఏంటీ అంటే… ఒక చిన్న పాప ఇంటి ముందు కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక సైకిల్ మీద వచ్చిన కోతి చిన్న పిల్లను లాక్కుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. వెంటనే అక్కడ ఉన్న ఒక వ్యక్తి కోతిని చూసి గట్టిగా అరిచాడు.

దీనితో కోతి చిన్నారిని వదిలేసి మళ్ళీ అదే సైకిల్ ఎక్కి పారిపోయింది. ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. కోతిని కావాలని సైకిల్ మీద ఎవరైనా ఎక్కించుకుని వచ్చారా…? ఆ కోతి అలా కావాలని చేసిందా…? ఎవరైనా పిల్లలను కిడ్నాప్ చేసే వాళ్ళు కోతికి అలాంటి ట్రైనింగ్ ఇచ్చారా అంటూ సోషల్ మీడియాలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా గాని కోతి గారు చేసిన కోతి పని మాత్రం కాసేపు చిన్నారిని భయపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news