అరె.. వాహనాలన్నీ మాయమవుతున్నాయేంది? ఈ వీడియో చూసి మీరు నెత్తిగోక్కవాల్సిందే..!

-

రోడ్డు మీద వాహనాలన్నీ మలుపు తిరుగుతూ మాయమైపోతుంటాయి. పక్కనే బ్రిడ్జి.. కింద కాలువ ఉంటుంది. మరి.. ఆ వాహనాలన్నీ ఎటుపోయినట్టు. అవన్నీ ఎందుకు మాయమైపోతున్నట్టు.. అనే డౌట్ మీకొస్తుంది. అయితే.. ఆ వీడియోను పరీక్షించి చూస్తే.. అసలు నిజం తెలిసిపోతుంది.

ఆప్టికల్ ఇల్యూజన్ అంటే తెలుసా మీరు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా అనుకోవడమే ఆప్టికల్ ఇల్యూజన్. దాన్నే మనం తెలుగులో భ్రాంతి అని అంటాం. సోషల్ మీడియాలో భ్రాంతికి సంబంధించిన ఎన్నో ఫోటోలను, వీడియోలను చూసి ఉంటాం. ఇది ఇంకో రకం భ్రాంతి. రోడ్డు మీద వాహనాలన్నీ మలుపు తిరుగుతూ మాయమైపోతుంటాయి. పక్కనే బ్రిడ్జి.. కింద కాలువ ఉంటుంది. మరి.. ఆ వాహనాలన్నీ ఎటుపోయినట్టు. అవన్నీ ఎందుకు మాయమైపోతున్నట్టు.. అనే డౌట్ మీకొస్తుంది. అయితే.. ఆ వీడియోను పరీక్షించి చూస్తే.. అసలు నిజం తెలిసిపోతుంది.

అవి మాయం అవడం కాదు.. ఏం కాదు.. అసలు వాహనాలు ఎందుకు మాయం అవుతాయి చెప్పండి. అదో భ్రాంతి. సరే.. మీకు అసలు నిజం తెలియాలంటే ముందు ఆ వీడియో చూడండి.. కాసేపు మీ మెదడుకు పదును పెట్టండి. వాహనాలు ఎందుకు మాయం అయ్యాయో ఆలోచించండి. తర్వాత మనం అసలు నిజం మాట్లాడుకుందాం.

చూశారు కదా.. వీడియో.. మీ మెదడుకు పదును పెట్టారా? అసలు.. ఆ వాహనాలు ఎందుకు మాయం అవుతున్నాయో అర్థమయిందా లేదా? ఇంకా మీ నెత్తిని గోక్కోకండి. అసలు నిజం ఏంటంటే.. ఆ వీడియోను తీసింది.. రెండో అంతస్తు బాల్కనీ నుంచి. బాల్కనీ గోడ, దాని కింద ఉన్న ఫ్లోర్ అచ్చం బ్రిడ్జి, కాలువలా కనిపిస్తున్నాయి. ఆ వీడియో తీసిన వ్యక్తి.. సగం రోడ్డును మాత్రమే కవర్ చేస్తూ వీడియో తీయడం వల్ల.. ఆ వాహనాలన్నీ బ్రిడ్జి కిందికి వెళ్లి మాయం అవుతున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు అర్థమయిందా? కావాలంటే మరోసారి ఆ వీడియోను చూడండి.. మీకే తెలుస్తుంది.

నెటిజన్లు కూడా ఆ వీడియోను చూసి నెత్తి గోక్కుంటున్నారు. చివరకు.. ఆ వీడియో గురించి తెలుసుకున్నాక వాళ్లలో వాళ్లే నవ్వుకుంటున్నారు. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం ఆ భ్రాంతి అసలు నిజాన్ని ట్వీట్లలో చెప్పేశారు. ఇక.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version